హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర టర్నింగ్ నుంచి వేగంగా దూసుకొచ్చిన బస్సు.. ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఓవర్ స్పీడుతో బస్సు యూటర్న్ తీసుకోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.