హైదరాబాదీలకు అలెర్ట్. ముఖ్యంగా సెకెండ్ హ్యాండ్ బైక్‌లు కొనాలనుకునే ప్లాన్‌లో ఉన్నవారికి ఇది సువర్ణావకాశం. ఫిబ్రవరి 20వ తేదీన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను బహిరంగ వేలంలో ఉంచేందుకు సిద్దంగా ఉన్నారు. మరి అందులో మీరు కూడా పాల్గొని.. మీకు నచ్చిన బైక్ తీసుకోవాలనుకుంటే.. వెంటనే ఈ స్టోరీలోకి వెళ్లిపోండి.
రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను బహిరంగ వేలానికి సిద్దం చేస్తున్నారు ఖాకీలు. ఫిబ్రవరి 20వ తేదీన అంబర్‌పేట్‌లోని రాచకొండ పోలీస్ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ బహిరంగ వేలాన్ని నిర్వహించనున్నారు. కాగా, సదరు వాహనాలను కొనుగోలు చేయాలని అనుకున్నవారు ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంబర్‌పేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో అడిషినల్ డీసీపీ అనుమతితో పరిశీలించుకుని.. అనంతరం బహిరంగ వేలంలో పాల్గొనాలని పోలీసులు కోరారు. ఇక సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9441037994, 8008338535గా ఉన్నాయి.
#RachakondaPolice to auction 283 #abandoned/#unclaimed Two & Three-wheeler vehicles which are lying at CAR, HQrt’s, Amberpet on 20.02.2023.
Contact 9441037994/8008338535 for further.@TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @eenadulivenews @sakshinews @THHyderabad pic.twitter.com/NSMMkXC6hG— Rachakonda Police (@RachakondaCop) February 13, 2023