Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. మర్మాంగం కోసుకొని మెడికల్ విద్యార్థి ఆత్మహత్య.

హైదరాబాద్‌లో దారుణ సంఘటన జరిగింది. దీక్షిత్‌ (21) అనే ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్య సంఘటన కలకలం రేపింది. ఈ సంఘటన హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన పాపిరెడ్డి నగర్‌లో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన సోమి రెడ్డి, కరుణ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి పాపిరెడ్డి...

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. మర్మాంగం కోసుకొని మెడికల్ విద్యార్థి ఆత్మహత్య.
Hyderabad

Updated on: Jul 10, 2023 | 9:33 AM

హైదరాబాద్‌లో దారుణ సంఘటన జరిగింది. దీక్షిత్‌ (21) అనే ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్య సంఘటన కలకలం రేపింది. ఈ సంఘటన హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన పాపిరెడ్డి నగర్‌లో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన సోమి రెడ్డి, కరుణ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి పాపిరెడ్డి నగర్‌లో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తెతో పాటు, కుమారుడు దీక్షిత్‌ రెడ్డి ఉన్నారు.

దీక్షిత్‌ రెడ్డి సికింద్రాబాద్‌ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సెకండ్ ఇయర్‌ చదువుతున్నాడు. అయితే దీక్షిత్‌ గత కొన్ని రోజులుగా మానసిక స్థితి బాగాలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఓసారి నిద్రమాత్రలు తీసుకున్నాడు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటున్న దీక్షిత్‌ గత కొన్ని రోజులుగా మానసిక సమస్యతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలోనే ఆదివారం కుటుంబ సభ్యులు బయటకెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చే సమయానికి దీక్షిత్‌ రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 108కి ఫోన్‌ చేయగా వచ్చి చూసిన సిబ్బంది.. దీక్షిత్‌ మర్మాంగం కోసుకొని మృతి చెందినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..