Telangana: డర్టీ మస్తాన్‌కి 14రోజుల రిమాండ్.. న్యూడ్ వీడియోలు, అమ్మాయిలను ట్రాప్‌ చేయడంపై..

మస్తాన్‌సాయిని మూడ్రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు నార్సింగి పోలీసులు. మరి విచారణలో తేలిందేంటి...? డర్టీ మస్తాన్‌ నుంచి పోలీసులు ఎలాంటి ఆన్సర్స్‌ రాబట్టారు...? ఆ తర్వాత ఏంటి.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి ఈ స్టోరీ చూసేద్దాం పదండి.. లేట్ ఎందుకు

Telangana: డర్టీ మస్తాన్‌కి 14రోజుల రిమాండ్.. న్యూడ్ వీడియోలు, అమ్మాయిలను ట్రాప్‌ చేయడంపై..
Mastan Sai

Updated on: Feb 15, 2025 | 7:46 PM

సంచలనం సృష్టించిన కామపిశాచి మస్తాన్‌ సాయికి రిమాండ్‌ విధించింది కోర్టు. మూడ్రోజుల కస్టడీ ముగియడంతో… వైద్య పరీక్షల తర్వాత అతడ్ని రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు నార్సింగి పోలీసులు. దీంతో 14రోజలపాటు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయించడంతో… అతడ్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక మూడ్రోజుల పాటు మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకుని విచారించిన నార్సింగి పోలీసులు… అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. హార్ట్‌డిస్క్‌, డ్రగ్స్‌ అంశాలపై కొశ్చన్‌ చేశారు. అయితే హార్డ్‌డిస్క్‌లోని న్యూడ్ వీడియోలు, అమ్మాయిలను ట్రాప్‌ చేయడంపై పోలీసుల ప్రశ్నలకు మస్తాన్‌సాయి సమాధానం ఇవ్వనట్లు తెలుస్తోంది.

తన ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌, భార్యతో ఉన్న వీడియోలు మాత్రమే హార్డ్‌డిస్క్‌లో ఉన్నట్లు మస్తాన్‌ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అలాగే మస్తాన్‌ హార్డ్‌డిస్క్‌లో 200మంది అమ్మాయిల వీడియోలను వారివారి పేర్లతో ఒక్కో ఫోల్డర్‌ క్రియేట్‌ చేసి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇటు మస్తాన్‌సాయి వాట్సాప్‌ చాటింగ్‌ను రిట్రీవ్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. అలాగే మస్తాన్‌సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలపైనా ఫోకస్‌ పెట్టారు. అయితే డ్రగ్స్‌ పార్టీలకు సంబంధించిన వీడియోల్లో ఉన్న వారంతా పరారీలో ఉండటంతో… వారి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి