Hyderabad: అక్క భర్తను ప్రేమించింది.. బావే కావాలంటూ మెుండిపట్టు.. చివరకు

|

Jul 18, 2024 | 11:40 AM

సొంత అక్క భర్తను ఆ యవతి లవ్ చేసింది. అతడితోనే జీవితాంతం కలిసి బతకాలని ఆరాటపడింది. అక్క గురించి ఆలోచించలేదు. ఇవేం పట్టించుకోకుండా బావ ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. ఆ తర్వాత....

Hyderabad: అక్క భర్తను ప్రేమించింది..  బావే కావాలంటూ మెుండిపట్టు..  చివరకు
woman (Representative image)
Follow us on

అట్రాక్షన్… ఈ మాయలో పడి చాలామంది.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గతంలో కౌమర దశలో ఉన్నవారే ఈ తరహా ఆకర్షణలకు లోనయ్యేవారు. కానీ ఇప్పుడు యంగ్ యేజ్, మిడిల్ ఏజ్‌లో ఉన్నవాళ్లు సైతం ట్రాక్ తప్పుతున్నారు. తాజాగా ఓ యువతి సొంత అక్క భర్తను ఇష్టపడింది. అతడిని ఘాడంగా ప్రేమించింది. అతడితోనే తన జీవితం పంచుకోవాలని ఉవ్విళ్లూరింది. విషయం తెలిసి.. తల్లిదండ్రులు మందలించారు. అక్క జీవితం కూలిపోతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ తను మాత్రం మొండిపట్టు వీడలేదు. కుటుంబ పెద్దలు కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేయడంతో.. బావతో జీవితం పంచుకోవడం కుదరదని.. సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన పాములపాటి ప్రసాద్ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారు జీవనోపాధి కోసం.. 2 సంవత్సరాల క్రితం నగర శివారు ప్రాంతానికి వచ్చారు. ఔటర్ రింగు రోడ్డు సమీపంలో గుడిసెలు వేసుకుని.. పొట్ట పోసుకుంటున్నారు. అయితే పెద్ద కుమార్తెకు.. నగరానికి వలస రాకపోముందే.. కారంచేడు ప్రాంతానికి చెందిన కల్యాణ్ బాబుతో పెళ్లి చేశారు. కల్యాణ్ బాబు తాపీ పని చేస్తుండేవారు.. అతను కూడా తర్వాతి కాలంలో భార్యతో కలిసి.. హైదరాబాద్‌కు వచ్చాడు. ప్రసాద్ చిన్న తనయ ఇందిర(20) టెన్త్ క్లాస్ తర్వాత చదువు ఆపేపింది. ఇంటి వద్ద పనులు చూసుకుంటూ.. అప్పుడప్పుడు తల్లిదండ్రులు, అక్కా బావతో.. పనులకు వెళ్లేది. అయితే ఇందిర.. తన అక్క భర్తను లవ్ చేసింది. అతడితో జీవించాలని నిర్ణయించుకుంది. ఇటీవల అక్కా బావ ఇంటికి వెళ్లి.. ఈ విషయాన్ని చెప్పింది.

వారు.. ఈ విషయాన్ని ఇందిర తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారు కూతుర్ని గద్దించారు. బయట తెలిస్తే.. పరువు పోతుందని.. వెంటనే ఇంటికి రావాలని కోరారు. కుటుంబ పెద్దలు కూడా వారించి.. ఇందిరను అమ్మానాన్నల వద్దకు పంపేందుకు ప్రయత్నించారు. దీంతో ఇందిర సోమవారం ఉదయం.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు తాగింది. నివాసానికి సమీపంలో అపస్మారిక స్థితిలో ఇందిరను గుర్తించిన కుటుంబ సభ్యులు .. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తలరించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇందిర మంగళవారం తుదిశ్వాస విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..