నలుచెరగులా నవ్య నగరాలతో.. మహానగరంగా మారుతోన్న భాగ్యనగరం..!

బొడ్రాయి ముహూర్తంలో ఏం మహత్తు ఉందో గానీ.. హైదరాబాద్ మహానగరంలోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఇదో అక్షయపాత్ర. విస్తరిస్తూనే పోతోంది. ఎంతమంది వచ్చినా 'ఇంకా ప్లేస్ ఉంది' అని చూపెడుతూనే ఉంది. బతుకుతెరువు కోసం వచ్చిన వారినల్లా అక్కున చేర్చుకుంటోంది. బిజినెస్‌లు పెడతాం అనే వారికి బోలెడు అవకాశాలు కల్పిస్తోంది. ఉత్తరాది నుంచి కొన్ని కమ్యూనిటీలు వచ్చి స్థిరపడ్డా.. వారి నోటి నుంచి కూడా 'యే హమారా హైదరాబాద్' అని పిలిపించుకుంది. భారత్‌ను ఒక్క రోజులో చూడాలనుకునేవారు హైదరాబాద్‌ను చుట్టేస్తే చాలు. అందుకనే... హైదరాబాద్ అవకాశాల గని.

నలుచెరగులా నవ్య నగరాలతో.. మహానగరంగా మారుతోన్న భాగ్యనగరం..!
Hyderabad Set To Become Indias Largest Metropolis

Updated on: Nov 27, 2025 | 9:50 PM

గ్రేటర్ హైదరాబాద్ కాదిక.. గ్రేటెస్ట్ హైదరాబాద్..! ఇదో బృహత్ హైదరాబాద్.. దేశంలోనే అతిపెద్ద నగరం.. హైదరాబాద్. ఔటర్ రింగ్ రోడ్ లోపల, దానికి ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ వల్లే.. దేశంలో అతిపెద్ద నగరంగా ఆవిర్భవించింది. జనాభా ఎంతో తెలుసా..? కోటి 45 లక్షలు ఉండొచ్చని రఫ్ ఎస్టిమేషన్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా గ్రేటర్ హైదరాబాదే కదా. ఆ లెక్కన జనాభా ఒక కోటి 70 లక్షలు. బట్.. అధికారికంగా జనాభా లెక్కలు తీస్తే.. ఆల్‌మోస్ట్ 2 కోట్లు దాటుతుంది. 2 కోట్ల మంది జనాభా ఉంటే సిటీ అనరు. ‘దేశం’ కింద లెక్కిస్తారు. బెల్జియం, చిలీ, కజకిస్తాన్, జాంబియా, బొలీవియా, రొమేనియా.. ఈ దేశాల జనాభా కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది ఉంటారు . హర్యానా జనాభా 2 కోట్ల 90 లక్షలు. పంజాబ్‌లో ఉండేది 3 కోట్లు. కేరళ రాష్ట్రం మొత్తం కలిపితే మూడున్నర కోట్లు. అంత పెద్ద ఢిల్లీలో ఉన్నది 2 కోట్ల 10 లక్షల మంది. హైదరాబాద్‌లో 2 కోట్ల జనాభా. సో, మన హైదరాబాద్ ఎంత పెద్దదో చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు. ఇవాళ హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్ట్స్… హైదాబాద్ చుట్టూ ఉన్న సిటీస్ గురించి మాట్లాడుకుంటాం. ఫోర్త్ సిటీగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ, ఏరోస్పేస్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి