
Hyderabad Metro: హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణపై మరోసారి ఆసక్తి నెలకొంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణికులకు వేగవంతమైన ప్రజా రవాణా సదుపాయాన్ని అందించడం లక్ష్యంగా మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు కీలకంగా మారింది. అయితే మెట్రో ఫేజ్ -2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.24,269 కోట్లతో 76 కిలోమీటర్ల పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం ఐదు కారిడార్లు, 76 కిలోమీటర్లకు ఆమోదం లభించింది. అలాగే 2029 నాటికి మెట్రో ఫేజ్ 2 నుంచి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదన ప్రకారం, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో ఏడు కారిడార్ల ద్వారా మొత్తం 122.9 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.38,595 కోట్లు. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
ప్రస్తుతం నగరంలో ఐటీ కారిడార్లు, శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో మెట్రో రవాణా సదుపాయాన్ని మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనల్లో ప్రధానంగా ఈ మార్గాలు ఉన్నాయి.
మెట్రో నెట్‌వర్క్ విస్తరిస్తే రహదారులపై ప్రైవేట్ వాహనాలపై ఆధారపడే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లేవారు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రజా రవాణాను సులభంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు మెట్రో సహాయపడుతుంది. అయితే ఈ ప్రయోజనాలు కొత్త మార్గాల నిర్మాణం పూర్తయి, సేవలు ప్రారంభమైన తర్వాతే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి