Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు

|

Jul 31, 2023 | 7:12 AM

రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం అత్యధికంగా సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా అత్యల్పంగా బండ మాదారంలో 24.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం రాత్రి జీహెచ్‌ఎంసీ పరిధిలోని కూకట్‌పల్లి, బాచుపల్లి, సికింద్రాబాద్, నేరెడ్‌మెట్‌, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, పంజాగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది...

Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు
Rains In Telangana
Follow us on

మొన్నటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతాపం చూపించిన వరుణుడు కాస్త శాంతించాడు. గడిచిన రెండు రోజులుగా వర్షం తగ్గుముఖం పట్టింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కొద్దిసేపే వర్షం కురిసింది. ఇదిలా ఉంటే తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం (ఆగస్టు 1) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు అధికారులు యెల్లో అలర్ట్‌ను జారీ చేశారు. సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మంగళవారం మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం అత్యధికంగా సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా అత్యల్పంగా బండ మాదారంలో 24.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం రాత్రి జీహెచ్‌ఎంసీ పరిధిలోని కూకట్‌పల్లి, బాచుపల్లి, సికింద్రాబాద్, నేరెడ్‌మెట్‌, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, పంజాగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఇదిలా ఉంటే గతేడాదితో పోల్చితే ప్రస్తుతం సీజన్‌లో 19 శాతం తక్కువగా వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గతేడాది జూన్‌ నుంచి జులై 30 వరకు 687.1 మిల్లీమీటర్ల వాన పడగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 559.1 మిల్లీమీటర్లు కురిసిందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్న తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..