Hyderabad: చాదర్‌ఘాట్ మూసీ సమీపంలో ఎగిసిపడుతున్న మంటలు.. రంగంలోకి ఫైర్ ఇంజన్లు!

హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం (జూలై 10) ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. చాదర్‌ఘాట్ మూసీ నది సమీపంలో ఉన్న ఒక డెకరేషన్ వస్తువుల గోదాంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. గోదాంలో ఈవెంట్లు, ఫంక్షన్లకు ఉపయోగించే ప్లాస్టిక్, థర్మాకోల్, బట్టలు, రసాయనాలతో కూడిన సులభంగా అంటుకునే డెకరేషన్ వస్తువులు భారీగా నిల్వ ఉంచారు. దీంతో క్షణాల వ్యవధిలోనే మంటలు గోదాం అంతటా విస్తరించి ఉగ్రరూపం దాల్చాయి.

Hyderabad: చాదర్‌ఘాట్ మూసీ సమీపంలో ఎగిసిపడుతున్న మంటలు.. రంగంలోకి ఫైర్ ఇంజన్లు!
Chaderghat Fire Accident

Updated on: Jul 10, 2026 | 6:02 PM

హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం (జూలై 10) ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. చాదర్‌ఘాట్ మూసీ నది సమీపంలో ఉన్న ఒక డెకరేషన్ వస్తువుల గోదాంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. గోదాంలో ఈవెంట్లు, ఫంక్షన్లకు ఉపయోగించే ప్లాస్టిక్, థర్మాకోల్, బట్టలు, రసాయనాలతో కూడిన సులభంగా అంటుకునే డెకరేషన్ వస్తువులు భారీగా నిల్వ ఉంచారు. దీంతో క్షణాల వ్యవధిలోనే మంటలు గోదాం అంతటా విస్తరించి ఉగ్రరూపం దాల్చాయి.

ప్రమాద తీవ్రత కారణంగా దట్టమైన నల్లటి పొగతో పాటు మంటలు ఆకాశమంత ఎత్తున పైకి ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు పొగ వ్యాపించడంతో స్థానిక నివాసితులు తీవ్ర ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. మంటలు వేగంగా వ్యాపించడంతో భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గోదాం చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు అప్రమత్తం చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి. లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us