దున్నకు రూ. 31 వేల విలువైన విస్కీ తాగించారు.. ఇది అలాంటి ఇలాంటిది కాదు

దీపావళి వేడుకల్లో భాగంగా నిర్వహించాే సదర్‌ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. మంగళవారం (అక్టోబర్ 21) హైదరాబాద్‌లో జరిగే సదర్‌ ఉత్సవాల్లో వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవబోతోంది. ఇంతకీ.. వస్తాద్ కాళీ దున్నరాజు హిస్టరీ ఏంటి..? దాని ధర ఎంతో తెలుసుకుందాం..

దున్నకు రూ. 31 వేల విలువైన విస్కీ తాగించారు.. ఇది అలాంటి ఇలాంటిది కాదు
Sadar Festival

Updated on: Oct 21, 2025 | 10:43 AM

సదర్‌ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. మంగళవారం (అక్టోబర్ 21) హైదరాబాద్‌లో జరిగే సదర్‌ ఉత్సవాల్లో వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవబోతోంది. ఇంతకీ.. వస్తాద్ కాళీ దున్నరాజు హిస్టరీ ఏంటి..?

భాగ్యనగరంలో బోనాల పండుగ తర్వాత సదర్ ఉత్సవాలు కూడా అదే రేంజ్‌లో గ్రాండ్‌గా జరుగుతాయి. దీపావళి తర్వాత రెండవ రోజు.. సికింద్రాబాద్, హైదరాబాద్‌లో యాదవ సామాజికవర్గం ఆధ్వర్యంలో ఈ సదర్ సమ్మేళనం నిర్వహిస్తారు. యాదవులు తమ దున్నపోతుల్లో బలమైన, అందమైన వాటిని ఈ సదర్‌ ఉత్సవంలో ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకుంటారు. పూలదండలు, గజ్జలు, ముత్యాల మాలలతోపాటు రకరకాల అలంకరణలతో దున్నపోతులను రెడీ చేసి రోడ్లపై ఊరేగిస్తారు. దున్నపోతుల చుట్టూ స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకుంటారు. వాటితో కుస్తీ పడుతూ చేసే విన్యాసాలు, డ్రాన్స్‎లు ఆట్టుకుంటాయి. సదర్‎కు వచ్చినవారు కులమతాలకు అతీతంగా ఒకరికొకరు అలాయ్ బలయ్ తీసుకుంటారు.

ఈ క్రమంలోనే.. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ మహానగరంలో సదర్ సందడి మొదలైంది. అయితే.. ఈ సారి సదర్‌ ఉత్సవాల కోసం దరువాలా మధు యాదవ్ కేరళ నుంచి తీసుకొచ్చిన వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. 2500 కేజీల బరువు.. 7 అడుగుల వెడల్పు ఉన్న ఈ దున్నపోతు ధర 25 కోట్ల రూపాయలు కావడం షాకిస్తోంది. ఈ ఏడాది సదర్ ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతుంది.

ఈ దున్నరాజు.. ప్రతిరోజు 10 లీటర్ల పాలతోపాటు కిలోల కొద్దీ ఆపిల్స్, డ్రై ఫ్రూట్స్ తింటుందని మధుయాదవ్‌ తెలిపారు. దున్నరాజుకు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడమే కాదు.. 31వేల రూపాయల విలువైన కాస్ట్‌లీ రాయల్ సెల్యూట్ మందు కూడా తాగుతుందన్నారు. వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజుతోపాటు.. హర్యానా, కేరళ నుంచి మరో 15 దున్నపోతులను కూడా తీసుకొచ్చామని మధుయాదవ్ తెలిపారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..