కజకిస్తాన్ రిపబ్లిక్ రాయబారిని సత్కరించిన హైదరాబాద్‌ GMR ఏరో ఎంటర్‌ప్రైజ్

భారత్‌లోని కజకిస్తాన్ రిపబ్లిక్ గౌరవ రాయబారి అజామత్ యెస్కారయేవ్‌ను హైదరాబాద్‌లోని GMR ఏరో ఎంటర్‌ప్రైజ్ అయిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సత్కరించింది. భారత్‌, కజకిస్తాన్ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో ఆయన కృషికి గానూ సత్కరించారు. ఈ సత్కారం గౌరవంగా భావిస్తున్నట్లు..

కజకిస్తాన్ రిపబ్లిక్ రాయబారిని సత్కరించిన హైదరాబాద్‌ GMR ఏరో ఎంటర్‌ప్రైజ్
GMR Aero Enterprise felicitates Ambassador of Republic of Kazakhstan

Updated on: Oct 08, 2025 | 8:46 AM

హైదరాబాద్‌, అక్టోబర్ 8: భారత్‌లోని కజకిస్తాన్ రిపబ్లిక్ గౌరవ రాయబారి అజామత్ యెస్కారయేవ్‌ను హైదరాబాద్‌లోని GMR ఏరో ఎంటర్‌ప్రైజ్ అయిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సత్కరించింది. భారత్‌, కజకిస్తాన్ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో ఆయన కృషికి గానూ సత్కరించారు. భారత్‌లోని కజకిస్తాన్ రిపబ్లిక్ గౌరవ రాయబారి అజామత్ యెస్కరయేవ్‌తో ఈ ప్రత్యేక సందర్భాన్ని పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు హైదరాబాద్‌లోని కజకిస్తాన్ రిపబ్లిక్ గౌరవ కాన్సుల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో, ఈ దేశాల మధ్య గొప్ప సహకారాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన అత్యుత్తమ కృషిగానూ ఆయనను సత్కరించినట్లు పేర్కొన్నారు.

వాణిజ్యం, పెట్టుబడి, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి రంగాలలో కజకిస్తాన్ – భారత్‌ మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి మా ఉమ్మడి నిబద్ధతను ఈ గుర్తింపు ప్రతిబింబిస్తుంది. కజకిస్తాన్ రాయబార కార్యాలయం మా గౌరవనీయ భాగస్వాములందరితో సన్నిహిత సహకారంతో ఈ ప్రయత్నాలను కొనసాగించాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కజకిస్తాన్ రిపబ్లిక్, భారత్‌ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో తన కృషికిగానూ GMR ఏరో ఎంటర్‌ప్రైజ్ అయిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సత్కారం పొందడం గౌరవంగా ఉందని కజకిస్తాన్ రిపబ్లిక్ రాయబారి అజామత్ యెస్కారయేవ్‌ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

కాగా కజకిస్తాన్ రిపబ్లిక్ రాయబారి అజామత్ యెస్కారయేవ్ గత నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్య సంరక్షణ, విద్య, పునరుత్పాదక ఇంధనం, కనెక్టివిటీ రంగాలలో కజకిస్తాన్ రిపబ్లిక్, తెలంగాణ రాష్ట్రం మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లోని జానాడులో ఉన్న కజకిస్తాన్ రిపబ్లిక్ గౌరవ కాన్సులేట్‌ను ఆయన సందర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.