Hyderabad: పోలీసులకే ఫ్యూజులౌట్.. ఈ వాహనంలో ఎలారా.. లోపల బ్యాగుల్లో

|

May 01, 2024 | 3:56 PM

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీల విషయంలో స్పీడు పెంచారు. ఒక్క వాహనాన్ని కూడా వదలడం లేదు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం తరలించే ఆస్కారం ఉండటంతో అర్బన్, రూరల్ ఏరియాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. తాజాగా...

Hyderabad: పోలీసులకే ఫ్యూజులౌట్.. ఈ వాహనంలో ఎలారా.. లోపల బ్యాగుల్లో
Money Transfer Vehicle
Follow us on

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల హీట్ పీక్‌కి చేరింది. గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు పక్కా వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. సభల్లో తూటాల్లాంటి డైలాగులతో ఓట్లు పొందేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో డబ్బుతో కూడా ఓటర్లను లోబరుచుకునేందుకు కొందరు ప్రయత్నాలు మొదలెట్టారు. డబ్బు, మద్యంతో ఓట్లను కొనేందుకు కొందరు లీడర్స్ రెడీ అయ్యారు. అందుకు సరికొత్త రూట్లను ఎంచుకుంటున్నారు. కొంత మంది హవాలా రూట్‌లో అక్రమంగా డబ్బు తరలించేందుకు పూనుకుంటున్నారు. ఇంకొందరు రూరల్ ఏరియాల గుండా వాహనాల్లో డబ్బు తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బ్యాంకులు, ఏటీఏంలకు డబ్బు తరలించే ఏజెన్సీలతో కొందరు బేరసారాలు జరుపుతున్నారు. వారికి భారీగా కమీషన్లు ఇచ్చి ఎవ్వరికీ డౌట్ రాకుండా బ్యాంకులకు డబ్బును తరలించే వ్యాన్లలో ఎలక్షన్  తాయిలాలను తరలిస్తున్నారు.

తాజాగా.. సైబరాబాద్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో బ్యాంకులకు డబ్బు తరలించే వాహనానంలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రూ.1.06 కోట్ల డబ్బును సీజ్ చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ? ఎవరి పంపారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది. అయితే  ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇలా బ్యాంకు, ATMలకు డబ్బును తరలించే వారు కచ్చితంగా.. ప్రతిరోజు ఎంత నగదు తరలిస్తున్నారు.. ఏ మార్గం గుండా, ఏ వాహనంలో తరలిస్తున్నారు.. అందులో ఉండే మేనేజర్, డ్రైవర్, గన్ మెన్ మొత్తం వివరాలు ఎన్నికల సంఘానికి తెలపాల్సి ఉంటుంది. అందుకు వారు QR కోడ్ ఇస్తారు. ఈ కోడ్‌లో నమోదు చేసిన డబ్బుకు మించి..  సొత్తు ఉంటే అది అక్రమంగా తరలిస్తున్న నగదుగా గుర్తిస్తారు.

ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని ప్రాంతాల్లో  చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చెకింగ్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  ఈ తనిఖీల్లో భారీగా డబ్బును, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..