కజకిస్తాన్‌లో జరిగిన అస్తానా ఇంటర్నేషనల్ ఫోరమ్ 2025లో పాల్గొన్న డాక్టర్ అలీ ఖాన్‌

హైదరాబాద్‌లోని కజకిస్తాన్ గౌరవ కాన్సుల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ అస్తానా ఇంటర్నేషనల్ ఫోరం 2025లో పాల్గొన్నారు. హైదరాబాద్, కజకిస్తాన్ మధ్య నేరుగా విమాన సేవలను ప్రారంభించే అవకాశాలను ఆయన చర్చించారు. జీఎంఆర్ ఆసక్తిని తెలియజేస్తూ, వాణిజ్యం, పర్యాటకం, పెట్టుబడులను పెంపొందించేందుకు ఎయిర్ కనెక్టివిటీని బలోపేతం చేయాలని ప్రతిపాదించారు.

కజకిస్తాన్‌లో జరిగిన అస్తానా ఇంటర్నేషనల్ ఫోరమ్ 2025లో పాల్గొన్న డాక్టర్ అలీ ఖాన్‌
Dr. Nawab Mir Nasir Ali Kha

Updated on: Jun 02, 2025 | 4:02 PM

కజకిస్తాన్‌లోని ఆస్తానాలో జరిగిన అస్తానా ఇంటర్నేషనల్ ఫోరమ్ 2025కి భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ గౌరవ కాన్సుల్ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు “కనెక్టింగ్‌ మైండ్స్‌, షేపింగ్‌ ది ఫ్యూచర్‌” అనే థీమ్‌తో కజకిస్తాన్ అధ్యక్షుడు హెచ్.ఇ. కాసిమ్-జోమార్ట్ టోకాయేవ్ ప్రారంభించిన ఈ ఫోరంలో 80 కంటే ఎక్కువ దేశాధినేతలు, మంత్రులు, CEOలతో సహా 50 దేశాల నుండి 5,000 మందికి పైగా పాల్గొన్నారు.

తన పర్యటన సందర్భంగా డాక్టర్ ఖాన్ తన సన్నిహితుడు, అస్తానా అంతర్జాతీయ విమానాశ్రయం ఛైర్మన్ యూసుఫ్ అల్జాదర్‌తో సమావేశమై, నూర్సుల్తాన్ నజర్‌బయేవ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదిత విస్తరణ, హైదరాబాద్, కజకిస్తాన్ మధ్య డైరెక్ట్‌ విమానాల ప్రారంభం గురించి చర్చించారు. వాణిజ్యం, పర్యాటకం, పెట్టుబడులకు మద్దతు ఇవ్వడానికి ఎయిర్‌ కనెక్టివిటీని బలోపేతం చేయడంపై చర్చించారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కజకిస్తాన్‌కు డైరెక్ట్‌ ఫ్లైట్‌ నడిపేందుకు జీఎంఆర్‌ ఆసక్తి చూపించినట్లు ఖాన్‌ వారికి వెల్లడించారు. దార్శనిక ప్రపంచ వేదికను నిర్వహిస్తున్నందుకు కజకిస్తాన్ నాయకత్వాన్ని డాక్టర్ ఖాన్ ప్రశంసించారు. వివిధ రంగాలలో ఇండో-కజఖ్ సంబంధాలను మరింత పెంపొందించడానికి కృషి చేస్తానన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి