Hyderabad: నగర కమిషనర్ ను కలిసిన మజ్లిస్ నేతలు.. రాత్రిపూట వ్యాపారాలపై కీలక చర్చ

| Edited By: Ravi Kiran

Apr 07, 2022 | 3:32 PM

రంజాన్(Ramadan) మాసంలో రాత్రిపూట వ్యాపారులు చేసుకునే వారికి పోలీసులకు సహకరించాలని కోరుతూ హైదరాబాద్(Hyderabad) నగర కమిషనర్ ను మజ్లిస్ నేతలు కలిశారు. రంజాన్ మాసంలో రాత్రిపూట ప్రజలను పోలీసులు...

Hyderabad: నగర కమిషనర్ ను కలిసిన మజ్లిస్ నేతలు.. రాత్రిపూట వ్యాపారాలపై కీలక చర్చ
Rath Bazaar
Follow us on

రంజాన్(Ramadan) మాసంలో రాత్రిపూట వ్యాపారులు చేసుకునే వారికి పోలీసులకు సహకరించాలని కోరుతూ హైదరాబాద్(Hyderabad) నగర కమిషనర్ ను మజ్లిస్ నేతలు కలిశారు. రంజాన్ మాసంలో రాత్రిపూట ప్రజలను పోలీసులు అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వారి విజ్ఞప్తిపై నగర కమిషనర్ స్పందించారు. ఈరోజు నుంచి రాత్రిపూట పూర్తిస్థాయిలో వ్యాపారాలు(Rath Bazar) చేసుకునే అవకాశం కల్పించారు. రంజాన్‌ మాసంలో హైదరాబాద్‌ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. హైదరాబాద్‌ అనగానే మనకు గుర్తొచ్చే చారిత్రాత్మక కట్టడం చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి మనకు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగే రాత్‌ బజార్‌కి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు రంజాన్‌ మాసంలో రాత్‌ బజార్‌ను చూసేందుకు వస్తుంటారు. చార్మినార్‌ ప్రాంతంలో నైట్ పాపింగ్ చేయడం ఒక సంప్రదాయంగా చాలా ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతోంది. రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్ష ముగించిన తరువాత పండ్లు, ఎండు ఫలాలు, హలీం వంటివి తినడం ఆనవాయితీ. వాటికోసం రాత్ బజార్ లో ప్రత్యేకమైన స్టాళ్లు వెలుస్తాయి.

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనపించడంతో ఆదివారం తెల్లవారు జాము నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలను ప్రారంభించారు. రంజాన్ (Ramzan )నెల ఆరంభం నుంచి ముస్లీంలు 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. వేకువ జామునే నాలుగు గంటలకు ఆహారం తీసుకుంటారు. దీన్నే సహర్ అంటారు. ఆతర్వాత సూర్యాస్తమయం అయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోరు. సాయంత్రం ఉపవాసాన్ని విరమించడాన్ని ఇఫ్తార్‌గా పేర్కొంటారు.

(నూర్ మహమ్మద్, టీవీ9 రిపోర్టర్)

Also Read

Anand Mahindra: ఆమె ట్వీట్ కు ఎమోష్నల్ అయిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే..

Shraddha Srinath: ఊహించని రెండు అనుభవాలతో షాక్ తిన్న జెర్సీ భామ.. అవేంటంటే