Hyderabad: తెల్లారి లిక్కర్ షాప్‌నకు వచ్చిన యజమాని.. సందులో కనిపించిన సీన్ చూడగా

మొన్న ఆదిలాబాద్‌ జిల్లాలో.. నేడు హైదరాబాద్‌లో.. తెలంగాణలోని మద్యం షాపుల్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రుల్లో లిక్కర్‌ షాపులను టార్గెట్‌ చేసి.. నగదు, మద్యం సీసాలను ఎత్తుకెళ్తున్న ఘటనలు పోలీసులకు సవాల్‌ విసురుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Hyderabad: తెల్లారి లిక్కర్ షాప్‌నకు వచ్చిన యజమాని.. సందులో కనిపించిన సీన్ చూడగా
Telangana

Updated on: Dec 20, 2025 | 9:43 AM

హైదరాబాద్‌లోని మద్యం షాపులను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం శివాలయం నగర్ ఆర్యన్ వైన్స్‌లో దొంగలు పడ్డారు. వైన్స్‌ షాపు గోడకు కన్నం వేసి లోపలకి వెళ్లిన ఓ దొంగ.. లక్ష రూపాయల నగదు, 15 మద్యం బాటిల్స్‌ ఎత్తుకెళ్లాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు.. వైన్స్‌లోని సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఈ ఘటనపై వైన్స్‌ యజమాని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వైన్స్‌ షాపు చోరీ దొంగల కోసం గాలింపు చేపట్టారు.

ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!

ఇక.. ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలోని ఓ వైన్స్ షాపులోనూ దొంగలు పడ్డారు. వైన్స్ వెనుక వెంటిలేషన్ కిటికీ తొలగించి షాపులోకి చొరబడ్డ దొంగలు.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి మరీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై యజమాని బాల్‌రాజ్‌గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్‌తోపాటు.. డాగ్ స్క్వాడ్‌తో వైన్స్‌ షాపు పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. వేలిముద్రాలను సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఇక.. మద్యం షాపులోని 3 లక్షల రూపాయల నగదుతో పాటు 20 వేల విలువైన మద్యం బాటిల్స్‌ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా.. మద్యం షాపుల్లో వరుస చోరీలతో యజమానులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..