
Gold Robbery: భాగ్యనగరంలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడిన దుండగులు దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్ పొట్లూరి రాజేశ్వరరావు దంపతులు బంజారాహిల్స్‌లో నివాసముంటున్నారు. అయితే వారిద్దరూ కొద్దిరోజుల క్రితం ఓ శుభకార్యానికి వెళ్లారు. మరుసటిరోజు తిరిగి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో బంగారు ఆభరణాలన్నింటినీ బీరువాలో భద్రపరిచారు.
అయితే, ఇటీవల బంగారు ఆభరణాల కోసం బీరువా తెరువగా.. అందులో నగలు కనిపించలేదు. దీంతో వారు షాక్‌కు గరయ్యారు. అయితే, ఇంట్లో పని చేసే పనిమనిషి బద్రి కుటుంబ సభ్యుల అంతిమ సంస్కారాల కోసం స్వగ్రామానికి వెళ్తున్నాని చెప్పి ఊరికి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన బద్రి ఇప్పటికీ తిరిగి రాలేదు. దాంతో వారు బద్రిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో అతనికి ఫోన్ చేయగా.. అది కూడా కలవలేదు. దాంతో డాక్టర్ దంపతులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆభరణాల చోరీపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Parakram Diwas : ఇవాళ బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన .. అసోంలో భూకేటాయింపు పత్రాలు పంపిణీ
తిరుపతి లో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్య కర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్