Hyderabad: అరెరే ఎన్ని కష్టాలొచ్చాయ్.. వైన్ షాపుల ముందు బారులు తీరిన జనాలు.. కారణం ఇదే..

| Edited By: Shiva Prajapati

Jul 15, 2023 | 10:26 PM

హైదరాబాదులో వైన్ షాపుల ముందు విపరీతంగా రద్దీ కనిపిస్తుంది. ఏకంగా కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మామూలుగా వీకెండ్‌లో కొంత క్రౌడ్ ఉండడం కామన్. కానీ ఈ వీకెండ్ కు ఇంతలా ఉండటానికి కారణం ఉంది.

Hyderabad: అరెరే ఎన్ని కష్టాలొచ్చాయ్.. వైన్ షాపుల ముందు బారులు తీరిన జనాలు.. కారణం ఇదే..
Wine Shops
Follow us on

హైదరాబాదులో వైన్ షాపుల ముందు విపరీతంగా రద్దీ కనిపిస్తుంది. ఏకంగా కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మామూలుగా వీకెండ్‌లో కొంత క్రౌడ్ ఉండడం కామన్. కానీ ఈ వీకెండ్ కు ఇంతలా ఉండటానికి కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసుకుందాం. లాక్ డౌన్ తర్వాత మద్యం షాపుల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది. మళ్లీ అదే స్థాయిలో ఇప్పుడు వైన్ షాపుల ముందు మద్యం ప్రియుల సందడి కనిపిస్తుంది. దసరా పండుగను మించిన రద్దీ. ఇంతకు విశేషం ఏంటి అనుకుంటున్నారా.. ధూమ్ దాం హైదరాబాద్ బోనాలు.. ఆదివారం సోమవారం వైన్ షాపులు బంద్ కావడంతో ఈ రెండు రోజులకు కావలసిన సరుకును ఇప్పుడే తెచ్చి పెట్టుకుంటున్నారు మద్యం ప్రియులు.

హైదరాబాదులో బోనాలంటే మామూలుగా ఉండదు మరి.. ఎక్కడెక్కడ ఉన్న చుట్టాలను పిలుచుకొని గట్టి దావత్ ఇస్తారు. అసలే తెలంగాణలో మందుకు ప్రత్యేక స్థానం ఉంది. వైన్ షాపులు బంద్ ఉన్నా వచ్చిన చుట్టాలకు కాందన్‌లో ఫరక్ రాకుండా చూడాలంటే ఈ మాత్రం సరుకు దింపాల్సిందే. మరోవైపు ఒక్క బోనాలు సందర్భంగానే రూ. 100 కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వానికి కూడా బోనాల సందర్భంగా ఖజానా నిండబోతుంది. అయితే, మద్యం షాపుల వద్ద జనాలు బారులు తీరడంలో వాహనదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..