AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!

మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక చిన్న 9 ఓల్ట్స్ (9V) బ్యాటరీ బాలుడి ప్రాణాల మీదకు రావడమే కాకుండా, అతని ప్రాణాల మీదకు తెచ్చింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని హుటాహుటీన ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!
Battery Explodes
P Shivteja
| Edited By: |

Updated on: May 03, 2026 | 7:21 PM

Share

మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక చిన్న 9 ఓల్ట్స్ (9V) బ్యాటరీ బాలుడి ప్రాణాల మీదకు రావడమే కాకుండా, అతని ప్రాణాల మీదకు తెచ్చింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని హుటాహుటీన ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శివంపేట మండలానికి చెందిన శివతేజ అనే బాలుడు, ఇంట్లో ఉన్న ఒక 9 ఓల్ట్స్ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు ప్రయత్నించాడు. సాధారణంగా ఇవి రీఛార్జబుల్ కాకపోయినప్పటికీ, తెలియక బాలుడు దానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఛార్జ్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్యాటరీ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది.

బ్యాటరీ పేలుడు ధాటి ఎంత తీవ్రంగా ఉందంటే, బాలుడి ఎడమ చేతి వేళ్లు అక్కడికక్కడే తెగిపడ్డాయి. అరచేయి పూర్తిగా ఛిద్రమై రక్తసిక్తమైంది. బాలుడి ఆర్తనాదాలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న శివతేజను చూసి హతాశులయ్యారు. క్షతగాత్రుడైన బాలుడికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హుటాహుటిన కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాలుడికి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. చేతి వేళ్లు పూర్తిగా తెగిపోవడంతో శివతేజ భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఘటన పిల్లలకు ఎలక్ట్రానిక్ వస్తువులను ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తు చేస్తోంది. ముఖ్యంగా తక్కువ వోల్టేజ్ బ్యాటరీలే కదా అని నిర్లక్ష్యం చేయకూడదని, అవి పేలినప్పుడు ప్రాణాంతకమైన గాయాలకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?