సినీ ఫక్కీలో దారి దోపిడీ..3 కార్లతో ఛేజ్ చేసి మరీ..

|

Dec 19, 2019 | 4:20 PM

ఆదిలాబాద్‌ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ కారులో వజ్రాలు ఉన్నాయని భావించిన దుండగులు మూడు కార్లతో వెంబడించారు. సినీ ఫక్కీలో కారును వెంబడించి అందులో ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేశారు. తుపాకులతో బెదిరించి కారును ఎత్తుకెళ్లారు. తీరా అందులో ఏమీ దొరక్కపోవడంతో కారును ధ్వంసం చేసి వెళ్లిపోయారు. బాధితులు గుడిహత్నూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు పరిశీలించగా.. గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి వద్ద పని చేసే […]

సినీ ఫక్కీలో దారి దోపిడీ..3 కార్లతో ఛేజ్ చేసి మరీ..
Follow us on
ఆదిలాబాద్‌ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ కారులో వజ్రాలు ఉన్నాయని భావించిన దుండగులు మూడు కార్లతో వెంబడించారు. సినీ ఫక్కీలో కారును వెంబడించి అందులో ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేశారు. తుపాకులతో బెదిరించి కారును ఎత్తుకెళ్లారు. తీరా అందులో ఏమీ దొరక్కపోవడంతో కారును ధ్వంసం చేసి వెళ్లిపోయారు. బాధితులు గుడిహత్నూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు పరిశీలించగా..
గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి వద్ద పని చేసే ఇద్దరు వ్యక్తులు కారులో హైదరాబాద్‌ వెళ్తున్నారు. అయితే, వీరి కారులో వజ్రాలు ఉన్నాయని భావించిన గుర్తు తెలియని వ్యక్తులు వారిని వెంబడించారు. కారును ఆపి తుపాకులతో బెదిరించి కారులో ఉన్నవారిని అక్కడే దించేశారు. అనంతరం అదే కారులో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల కారుని మహారాష్ట్రకు తీసుకెళ్లి అందులోని డైమండ్ లాకర్లను తెరిచారు. కారును ధ్వంసం చేశారు. ఏమీ లభించకపోవటంతో కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు మూడు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు చేపట్టగా మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ జిల్లా వారాకౌఠ వద్ద కారు దొరికింది. ఉట్నూరు పోలీసులు కారును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.