
ఎక్కడ చూడు కామాంధులే. అమ్మాయిలకి అస్సలు రక్షణ లేదు. బడికిపోతే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఇబ్బందిపట్టే ఉపాధ్యాయులు రూపంలో ఉన్న కామాంధులు కొందరైతే.. అమ్మాయి వాష్ రూమ్స్‌లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేసి.. వికృత ఆనందం పొందే.. మారీచులు మరికొందరు. తాజాగా కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో హిడెన్ కెమెరా కలకలం రేపింది. అమ్మాయిల బాత్రూమ్‌లో అటెండర్ యాకూబ్ సీక్రెట్ కెమెరాను పెట్టి.. వీడియోలు రికార్డు చేస్తున్నాడు. బాత్రూమ్‌లో ఓ పరికరం మెరుస్తూ ఓ పరికరం బాలికల కంటపడింది. ఏంటా అని చెక చేయగా.. రహస్య కెమెరా అని గుర్తించారు. వెంటనే హెడ్మాస్టర్‌కి, తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశారు.
బాత్రూమ్ నుంచి కెమెరా తరహా పరికరం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న యాకూబ్ కోసం.. గాలింపు చేపట్టారు.
Also Read: ఆశ్చర్యం.. 3 పడగలు విప్పి తారసపడ్డ అరుదైన శ్వేతనాగు..