Telangana Politics: బిగ్ డే.. తెలంగాణలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహం ఇదేనా..?

|

Sep 16, 2023 | 9:59 AM

ఓ వైపు జాతీయ సమైక్యత దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం.. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి.. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. తెలంగాణ కేంద్రంగా ఇటు జాతీయ పార్టీలు, అటు అధికార పార్టీ బీఆర్ఎస్ సరికొత్త ప్లాన్‌తో ముందుకువెళ్తున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇవాళ, రేపు ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేక పొలిటికల్ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.

Telangana Politics: బిగ్ డే.. తెలంగాణలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహం ఇదేనా..?
Telangana Politics
Follow us on

ఓ వైపు జాతీయ సమైక్యత దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం.. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి.. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. తెలంగాణ కేంద్రంగా ఇటు జాతీయ పార్టీలు, అటు అధికార పార్టీ బీఆర్ఎస్ సరికొత్త ప్లాన్‌తో ముందుకువెళ్తున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇవాళ, రేపు ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేక పొలిటికల్ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం, మరోవైపు సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రాకతో పొలిటికల్ హీట్ నెలకొంది.

రెండు రోజుల సీడబ్ల్యూసీ సమావేశంలో భాగంగా కాంగ్రెస్‌ అతిరథ మహారధులంతా హైదరాబాద్‌కి తరలివస్తున్నారు. ఇవాళ, రేపు జరగనున్న CWC సమావేశాల్లో సోనియా, రాహుల్‌, ప్రియాంకతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలంతా పాల్గోనున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్‌ గా నిర్వహిస్తున్న CWC సమావేశాల్లో ఇండియా కూటమి సీట్ల పంపకాలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్‌ వేదికగా జరగనున్న CWC సమావేశాలతో తెలంగాణ కాంగ్రెస్‌కి కొత్త జోష్‌ వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా ఎన్నికలవేళ కలిసొస్తుందని.. ఫైవ్‌ పాయింట్‌ ఫార్ములా కలిసి వస్తుందని అంచనావేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బహిరంగ సభలో ఆరు గ్యారెంటీ హామీలు ప్రకటించనుంది. అంతేకాకుండా భారీగా చేరికలు కూడా ఉంటాయని తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. మరోవైపు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఇవాళ హైదరాబాద్‌ రాబోతున్నారు. కేవలం 20రోజుల గ్యాప్‌లో రెండోసారి తెలంగాణకు వస్తుండటంతో కషాయ పార్టీ నేతల్లో జోష్ నెలకొంది. ఈరోజు, రేపు అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవంతో స్పీడును పెంచనుంది. విమోచన దినోత్సవం సెంటిమెంట్‌తో ఆకట్టుకునే యత్నాలను మొదలుపెట్టడంతోపాుట.. వ్యూహాలపై టీబీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనుంది.

తెలంగాణ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ కూడా బిగ్‌ ప్రోగ్రామ్‌తో ప్రజల ముందుకు వస్తోంది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్‌. పాలమూరు ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ భారీ ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు అంకితం చేయబోతున్నారు కేసీఆర్‌. ఇవాళే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం వెనుక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు గులాబీ బాస్.. పాలమూరు ప్రాజెక్ట్‌ ను ప్రజలకు అంకితం చేయడంతో ఎన్నికలవేళ కలిసొస్తుందని లెక్కలు వేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌.. పాలమూరు రంగారెడ్డి ప్రారంభం.. భారీ బహిరంగ సభతో ప్రజల దగ్గరకు వెళ్లేలా సన్నాహాలను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ తో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..