AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ రెయిన్ అలర్ట్.. పలు జిల్లాలకు హెచ్చరిక

తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Rain Alert: తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ రెయిన్ అలర్ట్.. పలు జిల్లాలకు హెచ్చరిక
Rains
Venkatrao Lella
|

Updated on: Jul 11, 2026 | 2:42 PM

Share

సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు శ్రీ గంగానగర్, రోహ్‌తక్, షాజహాన్‌పూర్, బస్తీ, ముజఫర్‌పూర్ మీదుగా, అక్కడి నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా మణిపూర్ వైపుగా విస్తరించి ఉంది. సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తెలంగాణ నుండి కర్ణాటక తీరానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఉన్న ద్రోణి బలహీన పడింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.  రాబోయే మూడ్రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు  వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వానలు పడుతున్నారు. వర్షాల క్రమంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. వానలు కురుస్తుండటంతో రైతులు పంట సాగుకు సిద్దమవుతున్నారు. అయితే గత ఏడాది కంటే రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదైంది. పలు జిల్లాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అయితే ఎన్‌నివో ప్రభావంతో ఈ సారి లోటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ ముందే అంచనా వేసింది. దీంతో గతంలో కంటే వర్షాలు చాలా తక్కువగా పడుతున్నాయి. అటు ఏపీలో కూడా పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన భారీ వానలు పడుతున్నాయి.  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, భోగాపురం, రణస్థలం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తెేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాకినాడ ,కోనసీమ ,తూర్పుగోదావరి జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు ఈదురుగాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతవారణశాఖ సూచించింది.

Follow Us