Telangana: వెంటాడిన విధి.. ట్రాక్టర్​ నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. ముగ్గురు దుర్మరణం

|

Mar 18, 2022 | 5:16 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంస్థాన్​ నారాయణపురం మండలం చిన్నంబావి వద్ద ప్రమాదం జరిగింది.  ట్రాక్టర్​ డ్రైవర్​కు గుండెపోటు రావడంతో.. ప్రమాదం జరిగి ముగ్గురు దుర్మరణం చెందారు.

Telangana: వెంటాడిన విధి.. ట్రాక్టర్​ నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. ముగ్గురు దుర్మరణం
Accident
Follow us on

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంస్థాన్​ నారాయణపురం మండలం చిన్నంబావి వద్ద ప్రమాదం జరిగింది.  ట్రాక్టర్​ డ్రైవర్​కు గుండెపోటు రావడంతో.. ప్రమాదం జరిగి ముగ్గురు దుర్మరణం చెందారు . శేరిగూడెంలో ఇటుకలను అన్​లోడ్​ చేసి వస్తుండగా.. ట్రాక్టర్ రన్నింగ్‌లో ఉండగానే​ డ్రైవర్​ ఎల్లయ్యకు హార్డ్‌ఎటాక్ రావడంతో డ్రైవింగ్​ సీటులో స్పాట్‌లో మృతి చెందాడు.  ఇంజిన్​పై డ్రైవర్ పక్కన కూర్చున్న వారికి ఏం చేయాలో తోచలేదు. డ్రైవర్​ చనిపోయి స్టీరింగ్​పై పడిపోవడంతో ట్రాక్టర్​ కంట్రోల్ తప్పి పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది. ఆ గుంటలోనే ట్రాక్టర్​ పల్టీ కొట్టడంతో ఇంజిన్​పై కూర్చున్న సీతారాం, దుర్గ అనే ఇద్దరు కూలీలు కూడా అక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను చౌటుప్పల్​లోని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇటుకల బట్టీలో కూలీలుగా ఉపాది పొందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి..  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పొట్టచేత పట్టుకుని పనికోసం ఇంతదూరం వచ్చామని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: పోర్న్‌ చూసేవారికి హెచ్చరిక.. మీరు మాస్టర్‌ స్కెచ్‌లో చిక్కుకుంటున్నారు.. వెన్నులో వణుకు పుట్టే నిజాలు