GST Council Meeting: జీఎస్టీ సమావేశంలో మంత్రి హరీష్‌రావు.. నిర్మలమ్మ దృష్టికి కీలక అంశాలు..

|

Jul 11, 2023 | 8:15 PM

న్యూ ఢిల్లీలోని మంగళవారం విగ్యాన్ భవన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 50వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి టి.హారీష్ రావు పాల్గొన్నారు. ఈ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో హరీశ్‌రావుగారు పలు అంశాలను ప్రస్తావించారు..

GST Council Meeting: జీఎస్టీ సమావేశంలో మంత్రి హరీష్‌రావు.. నిర్మలమ్మ దృష్టికి కీలక అంశాలు..
Gst Council Meeting
Follow us on

న్యూ ఢిల్లీలోని మంగళవారం విగ్యాన్ భవన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 50వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి టి.హారీష్ రావు పాల్గొన్నారు. ఈ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో హరీశ్‌రావుగారు పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ ఫండ్స్ ఇతర రాష్ట్రాలకు చెల్లించిన అంశాన్ని పరిష్కరించాలని, చాలా కాలంగా అడుగుతున్నా కొలిక్కిరాలేదని అన్నారు. ఉదాహరణకు మహారాష్ట్రకు చెందిన ఒక టాక్స్ పేయర్ రూ. 82 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఆ టాక్స్ పేయర్ కూడా అంగీకరించారు. అయితే తనకు రీఫండ్ రాగానే చెల్లిస్తామని క్లారిటీ ఇచ్చారు. కానీ పెండింగ్‌లోనే ఉండిపోయిందని తెలిపారు.

గతంలో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే దీన్ని లేవనెత్తామని, ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు హామీ లభించిందని, కానీ కార్యరూపం దాల్చలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకూ ఈ విషయంలో ఎలాంటి చర్యలూ లేవని, అందువల్ల ఇలాంటి అంశాలను సత్వరం పరిష్కరించేందుకు గతంలో హామీ ఇచ్చినట్లుగా ఆఫీసర్ల బృందాన్నిగానీ లేదా గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ గానీ ఏర్పాటు చేయాలన్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారు. 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించుకున్నట్లుగా అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి