
సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో సామాన్యులకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం బల్క్ ప్రొక్యూర్‌మెంట్‌పై తాత్కాలిక నిబంధనలను ప్రవేశపెట్టిందని, ఇవి పేదలు, బలహీన వర్గాలను ప్రపంచ ఇంధన సంక్షోభం నుండి కాపాడాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచం సాధారణ స్థితికి వస్తున్నందున ఈ నిబంధనలను తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
వీటిపైనే ఆంక్షల తొలగింపు..
ప్రభుత్వం తాజాగా నిర్ణయంలో ఫ్యూయల్ స్టేషన్ల నుండి హై-స్పీడ్ డీజిల్ కొనుగోలుపై ఉన్న రోజుకు 200 లీటర్ల పరిమితిని ప్రభుత్వం పూర్తిగా తొలగిపోయింది. దీంతో పరిశ్రమలు, వ్యాపారాల వంటి పెద్ద వినియోగదారులు నిర్దేశిత కన్స్యూమర్ పంపుల నుంచే కాకుండా, ఇకపై ఏ అవుట్‌లెట్ నుండైనా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే పాత విధానంలోనే సిలిండర్ల సరఫరా కూడా కొనసాగుతోందని.. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.183 వరకు తగ్గించారని తెలిపారు. ఈ నిర్ణయం వ్యాపారాలకు, హోటళ్లకు, రెస్టారెంట్లకు ఎంతగానో సహాయపడుతుందని ఆయన అన్నారు.
అంతర్జాతీయంగా ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.1,600గా ఉన్నప్పటికీ, ప్రభుత్వం భారాన్ని తగ్గించి సామాన్యులకు రూ.900కే అందుబాటులోకి తెచ్చిందని మంత్రి గుర్తుచేశారు. ప్రజలకు సహాయపడే ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు తెలంగాణ ప్రజల తరపున ప్రధాని మోదీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతిపక్షాల ఆరోపణలపై విమర్శలు
ఇదిలా ఉండగా అటు ప్రతిపక్షాలపై కూడా కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశం ‘ఆర్థిక సునామీ’ని ఎదుర్కొంటోందని, గందరగోళం ఏర్పడుతుందని చెబుతూ ప్రజల్లో, పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు.
పెట్రోల్ పంపుల వద్ద క్యూలు ఉంటాయని, ఎల్పీజీ సిలిండర్ల కొరత వస్తుందని ఆయన భయపెట్టాలని చూశారని ఆరోపించారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో 2 నెలల పాటు హోర్ముజ్ జలసంధి మూతబడినా దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏమాత్రం తలెత్తకుండా ప్రధాని మోదీ చూసుకున్నారని స్పష్టం చేశారు. ఒక్క పెట్రోల్ పంపులోనూ ఇంధన కొరత రాలేదని, ఏ ఇల్లూ ఎల్పీజీ లేకుండా పోలేదని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, లేదా పశ్చిమ ఆసియా సంక్షోభం.. ఇలా ఏది వచ్చినా ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలను రక్షించే నిర్ణయాలే తీసుకున్నారని, ఆయన లక్షలాది మంది భారతీయులకు రక్షణ కవచంగా నిలిచారని కొనియాడారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.