తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా దేవుడి విగ్రహాలు, నందులు పాలు, నీళ్లు తాగుతూ భక్తులను సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. వినాయకుడి విగ్రహం పాలు తాగడం.. సాయిబాబా విగ్రహం నుంచి విభూతి రాల్చడం ఇలా ఎన్నో విచిత్ర సంఘటనల గురించి మనం వింటుంటాం. తాజాగా అలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో జరిగింది. సిద్ధిపేటలో దాస ఆంజనేయ స్వామి ఆలయంలో అమ్మవారి విగ్రహం (Parvathi Idol) పాలుతాగుతుందంటూ వార్త ఆనోట ఈనోట ఊరు ఊరంతా వ్యాపించింది, దీంతో జనం తండోపతండాలుగా పాలతో గుడికి క్యూ కట్టారు.
పార్వతీ దేవి పాలుతాగుతున్న ఘటన సిద్దిపేట పట్టణంలో వెలుగు చూసింది. సిద్దిపేట పట్టణంలోని దాసంజనేయ ఆలయంలో శివ కుమార్ శర్మ అనే పూజారి గత నాలుగేళ్లుగా పూజలు చేస్తున్నాడు. గత రాత్రి ఆలయ పూజారికి అమ్మవారు కలలో ప్రత్యక్షమై రేపు ఉదయం తనకు పాలు పోయాల్సిందిగా కోరినట్లు ఆలయ అర్చకుడు తెలిపారు. అమ్మవారి కోరిక మేరకు మర్నాడు ఉదయమే ఆలయానికి వచ్చి అమ్మవారికి పాలు పోయాగా..పార్వతీ దేవీ విగ్రహం పాలు తాగిందని చెప్పాడు పూజారి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పట్టణ ప్రజలకు పాకింది. దీంతో అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి క్యూ కట్టారు. బారులు తీరి అమ్మవారికి పాలు తాగిస్తున్నారు భక్తులు. కొందరు పూనకాలు వచ్చి శిగాలు ఊగుతున్నారు. ఇక్కడి ఆలయం ఎంతో విశిష్టమైనది కావటం, అమ్మవారు పాలు త్రాగడం వల్ల కరోనా కష్టం కాలం నుండి మనం గట్టేకేమని, రానున్న రోజులు అందరికీ మంచి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read: RRR Movie: ఓటీటీలో సందడి చేయనున్న ఆర్ఆర్ఆర్.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..
PVR-Inox: సినిమా తెర ప్రపంచంలో బిగ్ డీల్.. పార్టనర్లుగా మారిన పీవీఆర్-ఐనాక్స్ లీజర్..
Lemon Juice: గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగుతున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..