
ప్రేమిస్తున్నానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. అతను చెప్పిన మాటలు నమ్మిన ఆమె.. అతనికి దగ్గరైంది..కానీ, అప్పుడే మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. పెళ్లంటూ నమ్మించి.. వేరే అమ్మాయితో పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు.. దీంతో కంగుతిన్న ఆమె.. సరిగ్గా పెల్లి సమయానికి ఎంట్రీ ఇచ్చింది.. తనని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని మోసం చేసి మరో అమ్మాయితో వివాహం చేసుకోవడానికి సిద్ధం కాగా.. ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు ఘటన కరీంనగర్‌లో చోటుసుకుంది.
వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామానికి చెందిన నరేశ్ చొప్పదండి పోలీసు స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హనుమకొండకి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది.. వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. 12 ఏండ్లుగా నరేష్ ఆ యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. తనని కాదని మరో అమ్మాయితో చొప్పదండిలో ఓ పంక్షన్ హాల్ లో వివాహం చేసుకొవడానికి నరేష్ సిద్ధం అవ్వగా.. ఈ విషయం ప్రియురాలికి తెలిసింది. దీంతో ఆ యువతి మహిళ సంఘాల నేతలతో కలిసి పంక్షన్ హాల్ కి వెళ్లి తన దగ్గర ఉన్న ఫోటోలు చూపించి వివాహం నిలిపివెయ్యాలని కోరింది.
వరుడు కుటుంబ సభ్యులు యువతిని అక్కడి నుండి గుట్టుచప్పుడు కాకుండా పంపించాలని ప్రయత్నించగా.. ఈ విషయం కాస్తా పెళ్లికూతురు వారికి తెలవడంతో వివాహం రద్దు చేసుకుని.. నరేష్ పై చొప్పదండి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసారు. నరేష్ విషయం తెలుసుకుని వధువు అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తను మోసం చేసిన ప్రియుడుతోనే పెళ్లి జరపాలని ప్రియురాలు పోలీసులను కోరుతోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..