Food Adulteration: ‘‘ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు!’’ అని రాక్షస రాజు హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు.. శ్రీమహావిష్ణువును కీర్తిస్తూ పాడిన పాట గురించి మనందరికీ తెలిసిందే. ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువును కీర్తిస్తూ పాడితే.. ఇప్పుడు మనం కల్తీ ఆహార పదార్థాల ముఠా దురాగతాలకు ఆవేదన చెందుతూ పాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును.. ‘ఇందుగలదందులేదు’ అన్నట్లుగా.. అన్నింట్లోనూ కల్తీ రాజ్యమేలుతోంది. డబ్బు సంపాదనే లక్ష్యంగా జనాన్ని నిండాముంచుతున్నారు నకిలీరాయుళ్లు. ఇక ఫేక్ ఫుడ్ ఐటమ్స్‌తో జనానికి కొత్త రోగాలను అంటగడుతున్నారు. కొద్ది రోజులుగా బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకులను అంటగడుతున్న దొంగల ముఠా బండారం బయట పడింది.
వివరాల్లోకెళితే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ పట్టణ శివారులో ఈ కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ దందా నడుస్తోంది. ఈ నకిలీ కంపెనీని సిరాజ్ అహ్మద్ అండ్ ముఠా నడిపిస్తోంది. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్‌తో దాడి చేశారు. కోటి రూపాయల విలువ చేసే కుల్లిన అల్లం, వెల్లుల్లి సీజ్ చేశారు పోలీసులు. ఇక ప్యాకింగ్‌కు సిద్దంగా ఉంచిన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇళ్ల మధ్యనే ఎళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడుస్తోంది. కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Indian Navy Jobs: పదోతరగతి అర్హతతో ఇండియన్ నేవీలో 127 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపికలు..
IND vs SL: రోహిత్ సరసన మరో స్పెషల్ రికార్డు.. టీ20ల్లో తొలి భారతీయుడు, ఫీల్డర్‌గా నాలుగో స్థానం..
Viral News: పరీక్షలో మెడికల్ స్టూడెంట్ హైటెక్ కాపీ.. వాడి టాలెంట్‌కు ఇన్విజిలేటర్ ఫ్యూజులు ఔట్!