Telangana Rains: హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే, పఠాన్ చెరు ప్రాంతంవైపు కూడా భారీ వర్షం కురుస్తోంది. అంబర్‌పేట్, నల్లకుంట, నాచారం, ఓయూ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, ఖైరతాబాద్ ఏరియాలో మోస్తరు వర్షం పడుతోంది. ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్‌బి నగర్, వనస్థలిపురం ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కాగా, మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపత్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డీఆర్ఎఫ్, మాన్‌సూన్ బృందాలను అలర్ట్ చేశారు అధికారులు. ఇప్పటికే రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగాయి జీహెచ్ఎంసీ ఆర్డీఎఫ్, మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు.
సమస్య ఉంటే ఈ నెంబర్‌కు కాల్ చేయండి..
నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. హైదరాబాద్ నగరంలో నేటి ఉదయం నుండి వర్షాలు కురుస్తుండటం, ఇంకా రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుపడంతో.. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవ్వరూ బయటకు వెళ్ళవద్దని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. అనవసరంగా బయటతిరిగి ఇబ్బందులకు గురికావవద్దని సూచించారు. అధికారులు అందరు అప్రమత్తంగా ఉన్నారని మేయర్ తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రం నంబర్ 040-21111111 కు సంప్రదించాలని కోరారు.