
నేపాల్ గ్రామీణ ప్రాంతంలోకి ఎవరు అడుగుపెట్టాలో మావోయిస్టులే నిర్ణయించేవారు. ఇప్పటిమాట కాదు ఓ దశాబ్దంన్నర కిందటి పరిస్థితి ఇది. అపట్లో సాయుధ పోరాటంతోనే అన్నీ సాధించగలమని నమ్మారు. బట్.. అంతటి సాయుధశక్తి ప్రజాస్వామ్యానికి తలవంచింది. దీన్నే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు. ట్రిగ్గర్ నొక్కితే తుపాకీ పేలుతుంది. నిజమే. ఎవరి మీదకి ఆ గురి? ఇది కదా క్లారిటీ ఉండాల్సింది. అప్పటికే 16వేల మంది చనిపోయారు. ఏం సాధించారు ఆ మారణహోమంతో అంటే.. నో ఆన్సర్. ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లారు కాబట్టే నేపాల్‌లో మావోయిస్టులు గెలిచారు. మరో ఎగ్జాంపుల్. శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర దిశనాయకే. ఓ కమ్యూనిస్టు నేత. ఆయుధమే సమాధానం చెబుతుందని ఒకనాడు నమ్మిన వ్యక్తి. రెండుసార్లు సాయుధ పోరాటం చేసి, క్యాడర్‌ను పోగొట్టుకుని, చేసేది లేక పోరాటం రూపం మార్చుకున్నారు. ప్రజాస్వామ్యం తప్ప మరో దారి కనిపించలేదతనికి. తిరిగి చూస్తే.. ఏకంగా దేశ ప్రధాని అయ్యారు. ఇది కదా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే. ప్రపంచం నిరంతరం మారుతుందన్నది నమ్మకం కాదు నిజం. ఆ వాస్తవాన్ని స్వీకరించలేకపోయింది ఇక్కడి మావోయిస్టు పార్టీ. దాని ఫలితమే ఈ చీకటి. 60 ఏళ్ల పాటు ఒక సిద్ధాంతం, ఒక పోరాటం నిలబడిందంటే.. ‘శభాష్’ అదే గొప్ప విజయం. కాని, ఇప్పటికీ అదే దారిలో వెళ్తామంటే..! ఆ మార్పు స్వాగతించనందుకు కాదా ఈ సంక్షోభం? నక్సల్బరీ నుంచి మావోయిజంగా మారి సాధించిందేంటి?...