ఫార్ములా ఈ రేసింగ్ పోటీలతో కలర్‌ఫుల్‌గా మారిన హుస్సేన్‌సాగర్ తీరంలో సెలబ్రిటీస్ సరికొత్త అందాలను తెచ్చారు. క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు. టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, నాగార్జున, నాగచైతన్య, కేజీఎఫ్ హీరో యష్, దుల్కర్ సల్మాన్, అఖిల్, సిద్దు జొన్నలగడ్డ, చిరంజీవి కుమార్తె సుస్మిత, మహేష్ బాబు కుమారుడు గౌతమ్.. రేసింగ్ పోటీలను తిలకించారు. రాంచరణ్‌తో కలిసి నాటునాటు సాంగ్‌కు పాదం కదిపారు ఆనంద్ మహీంద్రా.