ఓటు వేసేందుకు సొంతూరు వెళ్తుండగా ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దశంకరంపేటలో బైక్‌‌పై వెళ్తున్న వారిని వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను లింగమయ్య, సాయవ్వ, సాయి, మానసగా గుర్తించారు.

ఓటు వేసేందుకు సొంతూరు వెళ్తుండగా ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
Road Accident Pedda Shankarampet

Updated on: Dec 13, 2025 | 9:03 PM

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దశంకరంపేటలో బైక్‌‌పై వెళ్తున్న వారిని వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను లింగమయ్య, సాయవ్వ, సాయి, మానసగా గుర్తించారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి గ్రామానికి చెందని లింగమయ్య కుటుంబం.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు ఒకే బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్మాప్తు చేపట్టారు.

ఈ హృదయ విదారక సంఘటన పెద్ద శంకరంపేట సమీపంలోని 161వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వెళ్తుండగా మృత్యువు కబళించింది. మృతులంతా హైదరాబాద్‌లోని లింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. స్వగ్రామంలో పంచాయతీ ఎన్నికలల్లో ఓటు వేసేందుకు తమ ద్విచక్ర వాహనంపై సొంతవూరుకు ఈ కుటుంబం వెళ్తోంది. గమ్యస్థానానికి చేరుకోకముందే రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు వారిని కబళించింది.

అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ప్రమాద ధాటికి నలుగురు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే 108 వాహనం వచ్చేలోపే నలుగురు తుదిశ్వాస విడిచారు. మృతదేహాలు రోడ్డుపై పడి ఉన్న తీరు చూసి స్థానికులను కన్నీరు పెట్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఒకే కుటుంబంలోని నలుగురు మరణించడంతో మాగీ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..