
హైదరాబాద్, అక్టోబర్ 20: రయ్.. రయ్‌మంటూ మరోసారి ఫార్ములా ఈ-వన్ రేసింగ్ కార్లు భాగ్యనగరంలో దూసుకుపోనున్నాయ్. మళ్లీ ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్ హైదరాబాద్ నడిబొడ్డున జరగనుంది. వచ్చే ఏడాది కూడా ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలను హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నట్టు ఎఫ్ఐఏఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ వెల్లడించింది. 2024, ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ వేదికగా ఈ-ఫార్ములా 10వ ఏబీబీ ఎఫ్ఐఏ సీజన్ రేసింగ్ పోటీలు జరగనున్నాయి. గురువారం సమావేశమైన ఎఫ్ఐఏఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్.. 2024 ఫార్ములా ఈ-రేసింగ్‌పై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాల్యుషాన్ని నియంత్రిస్తూ ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ రేసింగ్ పోటీలపై జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
Formula E comes to #Hyderabad yet again – Feb 10, 2024
The racing track remains the same as last year – adjacent to Hussain Saagar
Get ready for an enhanced & improved version of sports extravaganza this season @FIAFormulaE @HMDA_Gov pic.twitter.com/UpcG8mpALp— Arvind Kumar (@arvindkumar_ias) October 20, 2023
ఇక ఈ ఏడాది దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఫార్ములా-ఈ రేసు’ నగర ఆర్ధిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపించినట్టు నీల్సన్ స్పోర్ట్స్ అనాలసిస్ అధ్యయనంలో వెల్లడైంది. ‘ఫార్ములా-ఈరేసు’ కారణంగా ఆర్ధిక వ్యవస్థ దాదాపు రూ. 700 కోట్ల మేరకు పుంజుకుందని తెలుస్తోంది.
2023, ఫిబ్రవరి 11న తొలిసారిగా హుస్సేన్‌సాగర్ తీరాన ‘ఫార్ములా-ఈ’ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పలు దేశాల నుంచి విచ్చేసిన 11 టీంలు పాల్గొన్నాయి. అలాగే 31 వేల మంది ప్రేక్షకులు ఈ-రేసింగ్‌ను లైవ్‌లో వీక్షించారు. వీరిలో 59 శాతం మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. అలాగే 150 దేశాల నుంచి ప్రేక్షకులు ఆన్‌లైన్ ద్వారా వీక్షించారు. కాగా, ఈ రేసింగ్ ఈవెంట్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్ విజేతగా జీన్ ఎరిన్ వెర్గ్‌నే నిలవగా.. రెండు, మూడు స్థానాల్లో నిక్ క్యాసిడీ, సెబాస్టియన్ నిలిచారు.
🇯🇵🇨🇳 New locations… and 🇲🇽🇸🇦🇮🇳🇧🇷🇮🇹🇲🇨🇩🇪🇺🇸🇬🇧 returning favourites…
Presenting our Season 10 calendar ⚡️
— ABB FIA Formula E World Championship (@FIAFormulaE) October 19, 2023
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం..