Vijayashanthi: ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ విస్మరించారు.. ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలన్న విజయశాంతి

రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్యజమెత్తారు. మంగళవారం ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.

Vijayashanthi: ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ విస్మరించారు.. ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలన్న విజయశాంతి
Vijayashanthi

Updated on: May 18, 2021 | 7:01 PM

Vijayashanthi fire on CM KCR: రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్యజమెత్తారు. మంగళవారం ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స పేరుతో భారీ మొత్తాలను దండుకుంటున్నారని. కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణ లేదన్నారు. పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించలేదని విజయశాంతి మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా విమర్శించారు.


తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5లక్షల వరకు కేంద్రమే భరిస్తుందని తెలిపారు. ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయిందన్నారు. తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని అమలు చేయట్లేదా? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్‌తో రేపు జరగబోతున్న “ గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష” ను విజయవంతం చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు.

Read Also…. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా టీకా యజ్ఞం.. తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన వ్యాక్సినేషన్.. ఇప్పటివరకు ఎంతమందికి అందిందంటే!

Loading...
Unable to load recommendations.
Follow Us