JC Diwakar Reddy: ప్రగతి భవన్ వద్ద మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి హల్‌చల్.. భద్రతా సిబ్బందితో వాగ్వాదం!

ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హల్‌చల్ చేశారు.

JC Diwakar Reddy: ప్రగతి భవన్ వద్ద మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి హల్‌చల్.. భద్రతా సిబ్బందితో వాగ్వాదం!
Jc

Updated on: Jan 19, 2022 | 2:16 PM

JC Diwakar Reddy at Pragathi Bhavan: ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి(JC Diwakar Reddy) మరోసారి హల్‌చల్ చేశారు. ఈసారి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్(Pragathi Bhavan) వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR), మంత్రి కేటీఆర్‌(KTR)ను కలిసేందుకు వచ్చిన జేసీని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అపాయింట్ మెంట్ లేకుండా అనుమతి ఇవ్వబోమని పోలీసులు జేసీ దివాకర్ రెడ్డికి తేల్చి చెప్పారు. అయినప్పటికీ ప్రగతి భవన్ లోకి దూసుకువెళ్లేందుకు జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నించారు.

అయితే అపాయింట్‌మెంట్ లేనిదే ప్రగతి భవన్ లోకి అనుమతి ఇవ్వబోమని భద్రతా సిబ్బంది చెప్పారు. ఈ విషయమై ప్రగతి భవన్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో జేసీ దివాకర్ రెడ్డిని ఆయన నివాసానికి తరలించారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్ ను కూడా జేసీ దివాకర్ రెడ్డి కలిశారు.

Read Also…  Goa Elections: గోవా ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్ పాలేకర్.. ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్