Telangana: మాజీ మంత్రి హరీష్‌రావుకు అస్వస్థత – కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స

తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు అనారోగ్యంతో బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం మధ్యలోనే హరీష్ రావుకు అస్వస్థత కలగడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం హరీష్ రావుకు తీవ్ర జ్వరంతో పాటు ఒత్తిడి కారణంగా అస్వస్థత కలిగినట్లు భావిస్తున్నారు. హరీష్ రావు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 

Telangana: మాజీ మంత్రి హరీష్‌రావుకు అస్వస్థత -  కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స
Harish Rao

Updated on: Jun 16, 2025 | 8:30 PM

హై ఫీవర్‌తో అస్వస్థతకు గురైన హరీష్‌రావు బేగంపేట కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేటీఆర్‌ సమావేశం మధ్యలోనే హరీష్‌రావు అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితిని డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..