Bonthu Rammohan: నన్నెవరూ అరెస్టు చేయలేదు.. ఆరోగ్యం బాగోలేక.. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేశా..

|

Dec 01, 2022 | 11:29 AM

సీబీఐ అధికారులు తనను అదుపులోకి తీసుకున్నారని సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఖండించారు. హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం ఆయన మీడియా ముందుకు వచ్చారు.

Bonthu Rammohan: నన్నెవరూ అరెస్టు చేయలేదు.. ఆరోగ్యం బాగోలేక.. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేశా..
Bonthu Rammohan
Follow us on

నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో సీబీఐ అధికారులు తనను అదుపులోకి తీసుకున్నారని సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఖండించారు. హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం ఆయన మీడియా ముందుకు వచ్చారు. మీరిన్నాళ్లు ఎక్కడికెళ్లారు? సీబీఐ అరెస్టు చేసిందా? మీకేమైనా నోటీసులొచ్చాయా? అని అడగ్గా ఆయన అలాంటిదేం లేదన్నారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని అన్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ను ఓ ఫంక్షన్‌లో కలిశాను. తనకు సీబీఐ నుంచి ఎలాంటి  నోటీసులు రాలేదన్నారు.

కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు నోటీసులు వస్తే తాను సమాధానం చెబుతానని తెలిపారు. అనంతరం ప్రస్తుతం వాడీ వేడిగా సాగుతోన్న కవిత ఇష్యూపై కూడా ఆయన స్పందించారు. నోటీసులు ఇవ్వగానే అవన్నీ నిజమై పోవన్నారు.

ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు.. అందులో ఇందులో పేర్లు ఇరికించగానే.. అవన్నీ వాస్తవాలై పోవని అన్నారాయన. మేం ఎందుకైనా రెడీ.. జైలుకైనా వెళ్తాం.. అన్నంత మాత్రాన.. మేమేం.. నేరం చేసినట్టు కాదనీ చెప్పుకొచ్చారు బొంతు రామ్మోహన్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం