తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్లీప్ మెడిసిన్ సెంటర్ ఫిలింనగర్‌లో ఏర్పాటు అయింది. మలేషియా, ఇటలీ దేశాల్లో డాక్టర్‌గా ఫెలోషిప్ చేసి.. మొట్ట మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లీప్ థెరపీ, స్లీప్ మెడిసిన్ సెంటర్‌ను హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఏర్పాటు చేశారు డాక్టర్ బోయిన్‌పల్లి హర్షిణి. ఫిలింనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన స్లీప్ థెరపిటిక్, స్లీప్ మెడిసిన్ హాస్పిటల్ ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుతో కలిసి ప్రారంభించారు.
నిద్రలో వచ్చే గురకతో వచ్చే వ్యాధుల పట్ల చాలామందికి అవగాహనలేదన్నారు హర్షిణి. గత 13 ఏళ్లుగా తాను ఎంతో పరిశోధన చేసి ..అందరికీ ఉపయోగపడేలా ఈ హాస్పిటల్‌ని ప్రారంభించానన్నారు. నిద్రకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి టెస్ట్‌లు అందుబాటులో లేవని.. మొదటిసారిగా డయాగ్నస్టిక్స్, థెరపీ, మెడిసిన్‌ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. శ్వాస, నిద్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..