Fire Broke in Asifabad: తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. వివరాల్లోకెళితే.. జిల్లాలోని కౌటాల మండలం గిన్నెలహట్టిలో విద్యుత్ తీగలు తెగి ఇంటిపై పడ్డాయి. దాంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఇల్లంతా వ్యాపించి గ్యాస్ సిలిండర్‌కు అంటుకోవడంతో అది కాస్తా పేలింది. దాంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి పక్కన ఉన్న మరో రెండు ఇళ్లకు వ్యాపించాయి. ఇంట్లోని వారు అప్రమత్తమై బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, దగ్ధమైన మూడు ఇళ్లు రాములు అనే వ్యక్తివి అని తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇళ్లకు అంటుకున్న మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read:
Farmers Protest: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం..