Organ Donation: చనిపోతూ.. ఆరుగురికి ఆయువు పోసిన యువకుడు.. !

తాను ఈ లోకాన్ని వీడుతూ, మరో ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు ఓ యువకుడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి చెందిన మదునురోళ్ల శ్రీకాంత్​ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆస్పత్రిలో తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. బ్రెయిన్​ డెడ్​ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Organ Donation: చనిపోతూ.. ఆరుగురికి ఆయువు పోసిన యువకుడు.. !
Organ Donation

Edited By: Balaraju Goud

Updated on: Oct 15, 2025 | 4:43 PM

తాను ఈ లోకాన్ని వీడుతూ, మరో ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు ఓ యువకుడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి చెందిన మదునురోళ్ల శ్రీకాంత్​ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆస్పత్రిలో తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. బ్రెయిన్​ డెడ్​ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కొడుకు కళ్ల ముందే జీవచ్ఛవంలా పడి ఉండటంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. చివరికి అతని రూపాన్ని మరొకరిలో చూసుకోవాలనుకున్నారు.

వైద్యుల సూచన మేరకు అవయవ దానం చేయాలని శ్రీకాంత్​ కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అత్యంత కష్ట కాలంలో వీరు తీసుకున్న ఈ చొరవ మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కారణమైంది. దసరాకు ఇంటికొచ్చి.. వెళుతుండగా ప్రమాదం బారినపడ్డాడు శ్రీకాంత్. అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్​ అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. కొన్నేళ్లుగా కిమ్స్​ ఆస్పత్రిలో పనిచేశాడు. మొదటి నుంచి సేవాభావాన్ని కలిగిన వ్యక్తి.

దసరా పండగను సంతోషంగా జరుపుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి సొంతూరికి వచ్చారు. పండగ అయిన తర్వాత తిరిగి విధులకు హాజరయ్యేందుకు హైదరాబాద్​ బయలుదేరారు. ఇంతలో అనుకోని రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్​ తలకు బలమైన గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు అతడిని కొండాపూర్​ కిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. అలా తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. బ్రెయిన్​ డెడ్​ అయ్యిందని డాక్టర్లు నిర్ధారించారు. కనీసం అవయవాలు దానం చేస్తే.. మరికొందరికి కొత్త జీవితం దొరుకుతుందని వైద్యులు నచ్చచెప్పారు. అత్యంత కష్టసమయంలో, కన్నీళ్లను దిగమింగుకొని సరేనంటూ అవయవ దానానికి కుటుంభసభ్యులు అంగీకరించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..