TRS Party: ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తాను చేపట్టే కార్యక్రమాలకు వస్తోన్న ప్రజాప్రతినిధులపై అధికారంలో ఉన్న నేతలు కక్ష కడుతున్నారని ఆరోపించారు. తానూ అధికార పార్టీ నేతనే అనే విషయాన్ని మరిచారని వ్యాఖ్యానించారు. నేడు పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ చెట్టు నీడలో ఉన్నవారే అని పేర్కొన్నారు.
తనపట్ల జరుగుతున్న పరిణామాల విషయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధైర్యపడొద్దని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పదవులు శాశ్వతం కాదని, సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. కాగా, కక్ష గడుతున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంత్రి పువ్వాడను ఉద్దేశించినవే అని టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా చర్చించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి మంత్రి పువ్వాడ, ఎంపీ పొంగులేటి మధ్య పొసగడం లేదని వార్తలు కూడా అప్పట్లో హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన నేడు చేసిన వ్యాఖ్యలు జిల్లా టీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా.. పార్టీ మొత్తంగా కలకలం రేగాయి.
Also read:
CM Uddhav tweet : ఆ రాష్ట్రంలోని ప్రాంతాలను కలిపేసుకుంటాం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన ట్వీట్..
Gupta Nidhulu: పొలం దున్నతుండగా దొరికిన గుప్త నిధులు.. పంట పండిందనుకున్నాడు.. కానీ అంతలోనే..