తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, మాజీ మంత్రి రామ‌స్వామి మృతి..

| Edited By:

Jul 10, 2020 | 11:58 AM

తెలంగాణ బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, మ‌హారాజ్ గంజ్ మాజీ ఎమ్మెల్యే పీ రామ‌స్వామి(87) క‌న్నుమూశారు. గురువారం రాత్రి ఆయ‌న గుండెపోటుతో మృతి చెందారు. రామ‌స్వామి హైద‌రాబాద్ న‌గ‌రంలోని మ‌హారాజ్ గంజ్ నియోజ‌క వ‌ర్గం నుంచి రెండుసార్లు...

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, మాజీ మంత్రి రామ‌స్వామి మృతి..
Follow us on

తెలంగాణ బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, మ‌హారాజ్ గంజ్ మాజీ ఎమ్మెల్యే పీ రామ‌స్వామి(87) క‌న్నుమూశారు. గురువారం రాత్రి ఆయ‌న గుండెపోటుతో మృతి చెందారు. రామ‌స్వామి హైద‌రాబాద్ న‌గ‌రంలోని మ‌హారాజ్ గంజ్ నియోజ‌క వ‌ర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. అలాగే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా సేవ‌లందించారు. ఆయ‌న‌కు భార్య, ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. గ‌త కొంత‌కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న రామ‌స్వామి.. డ‌యాలిస్ కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలో గుండెపోటు రావ‌డంతో తుది శ్వాస విడిచారు. కాగా మాజీ మంత్రి మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హా ప‌లువురు రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.