YS Sharmila Party : వైఎస్‌ షర్మిల పార్టీలోకి మాజీ డీజీపీ స్వరన్ జిత్ సేన్ ? బ్రదర్ అనిల్ తోనూ.. అనితా సేన్ చర్చలు

|

Mar 23, 2021 | 5:59 PM

YS Sharmila Noel Swaranjit Sen : తెలంగాణలో సరికొత్త రాజకీయాలకు తెరతీస్తోన్న వైయస్ షర్మిల పెట్టబోయే పార్టీలోకి మాజీ..

YS Sharmila Party : వైఎస్‌ షర్మిల పార్టీలోకి మాజీ డీజీపీ స్వరన్ జిత్ సేన్ ? బ్రదర్ అనిల్ తోనూ..  అనితా సేన్ చర్చలు
Swaranjit Sen Sharmila Brot
Follow us on

YS Sharmila Noel Swaranjit Sen : తెలంగాణలో సరికొత్త రాజకీయాలకు తెరతీస్తోన్న వైయస్ షర్మిల పెట్టబోయే పార్టీలోకి మాజీ డీజీపీ స్వరన్ జీత్ సేన్ చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్ లోటస్‌ పాండ్‌ ఆఫీస్ లో వైయస్ షర్మిలను స్వరన్ జీత్ సేన్ సతీమణి అనితా సేన్ కలిశారు. వైయస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ తో అనితా సేన్ చర్చలు జరిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో స్వరన్‌ జిత్‌ సేన్‌ డీజీపీగా పనిచేశారు. కాగా, వైయస్ షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీకి స్వరన్‌ సేన్‌ సలహాదారుడిగా పనిచేసే అవకాశముందని చర్చ షురూ అయింది.

ఇలా ఉండగా, తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్న వైఎస్‌ షర్మిల అందరి అభిప్రాయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్ అభిమానులందరితోనూ తన ఆలోచనలు కూడా పంచుకుంటున్నారు షర్మిల. దీంతో లోటస్ పాండ్‌ నెలరోజులుగా వరుస ఆత్మీయ సమ్మేళనాలతో సందడిగా కనిపిస్తోంది. జెండా..ఎజెండా తర్వాత. ముందు అందరి మద్దతు కూడగట్టుకోవాలి. అప్పుడే పార్టీ ఆవిర్భావం అనుకున్న స్థాయిలో ఉంటుందన్న ఆలోచనతో ఉన్నారు షర్మిల. అందుకే రాజకీయపార్టీ పెట్టబోతున్నానని ప్రకటించినప్పటినుంచీ అన్ని వర్గాలతో సమావేశమవుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు…ఇతర పార్టీల నేతలు, తటస్థంగా ఉన్నవారు లోటస్‌పాండ్‌కు వచ్చి వైఎస్‌ షర్మిలతో భేటీ అవుతున్నారు.

నిన్న ముస్లిం మైనారిటీలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముస్లిం వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు షర్మిల. ముస్లింలు లేని తెలంగాణను ఊహించలేమన్న ఆమె.. తెలంగాణలో వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గంగ జమున తహెజీబ్ అంటూ పాలకులు మాటలకే పరిమితమయ్యారని, ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్‌గానే చూస్తున్నారని షర్మిల విమర్శించారు. 12 శాతం రిజర్వేషన్లంటూ ముస్లింలకు ఇచ్చిన హామీని టీఆర్‌ఎస్‌ నిలబెట్టుకోలేదన్నారు షర్మిల. రిజర్వేషన్లు ఇవ్వకుండా ముస్లింలను కేసీఆర్‌ మోసగించారని విమర్శించారు షర్మిల. 57వేల ఎకరాల వక్ఫ్‌భూములు అన్యాక్రాంతమయ్యాయన్న షర్మిల.. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాతబస్తీలో కొత్తగా ఏదైనా అభివృద్ధి జరుగుతోందా అని ప్రశ్నించారు. ముస్లింల సమస్యపై పోరాడతానని ప్రకటించారు. వ్యూహాత్మకంగా అన్ని వర్గాలతో సమావేశమతున్నారు షర్మిల. విస్తృతస్థాయిలో సమావేశాల తర్వాతే పార్టీపై కీలక ప్రకటన చేయబోతున్నారు.

Read also : AP Weather report : ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు : వాతావరణ కేంద్రం