Somesh Kumar: సీఎం కేసీఆర్‌ ప్రధాన సలహాదారుగా సోమేశ్‌ కుమార్‌ బాధ్యతలు.. మూడేళ్ల పాటు కేబినెట్‌ హోదాలో..

|

May 12, 2023 | 11:54 AM

ఇవాళ ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్‌లో అర్చకులు పూజలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమేష్ కుమార్‌కు సచివాలయంలోని అధికారులు..

Somesh Kumar: సీఎం కేసీఆర్‌ ప్రధాన సలహాదారుగా సోమేశ్‌ కుమార్‌ బాధ్యతలు.. మూడేళ్ల పాటు కేబినెట్‌ హోదాలో..
Somesh Kumar
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్‌ సోమేశ్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్‌లో అర్చకులు పూజలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమేష్ కుమార్‌కు సచివాలయంలోని అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజనచట్టంలో భాగంగా ఏపీ క్యాడర్‌కు వెళ్లిపోయారు సోమేష్‌ కుమార్‌. అయినా.. క్యాడర్‌ అలాట్‌మెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. క్యాట్‌కు వెళ్లారు. స్టే ఆర్డర్‌తో తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత పలు పోస్టుల్లో పని చేసిన సోమేష్‌.. సీఎస్‌గా కూడా పని చేశారు. ఫైనల్‌గా హైకోర్టు క్యాట్‌ ఆర్డర్స్‌ను కొట్టివేయడంతో.. ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

తర్జన భర్జనల మధ్య ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేశారు. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం సోమేష్‌కు ఎలాంటి పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు. అయితే.. కొద్ది రోజుల్లోనే వీఆర్‌ఎస్‌ తీసుకొని సర్వీస్‌ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక సలహాదారునిగా నియమితులయ్యారు.