Etela Jamuna: ఈటలను చంపేందుకు కుట్ర జరుగుతోంది..ఈటల జమున సంచలన వ్యాఖ్యలు
Etela Jamuna: ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఇచ్చి ఖర్చు చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నట్లుగా తమకు తెలిసిందని ఈటల జమున అన్నారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అండతో..

హైదరాబాద్, జూన్ 27: ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సీరియస్ కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఇచ్చి ఖర్చు చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నట్లుగా తమకు తెలిసిందని ఈటల జమున అన్నారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అండతో కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ను చంపేస్తామంటే తాము భయపడిపోమన్నారు. కౌశిక్ రెడ్డి మాటల వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని.. ఓటుతో ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్తారని అన్నారు. హుజూరాబాద్ జనంపైకి కౌశిక్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఉసిగొల్పారని.. దీంతో కౌశిక్ హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కూలగొట్టించారని.. తమ కుటుంబంలో ఎవరికి హాని జరిగినా దానికి ముఖ్యమంత్రి కారణమని ఈటల జమున ఆరోపించారు.
బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని అనడం తప్పుడు ప్రచారం అని..ఆయన పార్టీలో సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీ మారను అంటూ ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశారని గుర్తు చేశారు. అయితే, తాను మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం