Bhadradri Kothagudem: ఈ మధ్య కాలంలో మావోయిస్టుల కదలికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ (Telangana)లోని భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ట్రెంచ్ పనులు జరుగుతుండగా, మావోయిస్టులు అడ్డుకునేందుకు వచ్చారు. ఈ ఘటన చర్ల మండలం బత్తినపల్లిలో చోటు చేసుకుంది. మావోయిస్టులకు ఎదురుపడిన పోలీసులు కాల్పులు జరిపారు. వారిని చూసి మావోయిస్టులు తప్పించుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. తప్పించుకుని పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.
ఇవి కూడా చదవండి: