
రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో 189 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగుతుంది. అదేవిధంగా 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది పోటీ పడుతుండగా.. 27,628 వార్డు స్థానాల్లో 65,455 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తొలి విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను వెంటనే వెల్లడిస్తారు. సాయంత్రంలోపే ఉప సర్పంచ్‌ల ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 93,905 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు
బ్యాలెట్ పేపర్‌ను డబ్బాలో వేసి వెనుతిరిగి వెంటనే ఓ వృద్ధుడు తనువు చాలించిన ఘటన నల్గొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకుంది. చెరుపల్లి బుచ్చయ్య(69) గురువారం ఉదయం ఓటు వేసేందుకు పోలింగ్ గదిలోకి వెళ్లి ఓటు వేసి స్పృహ కోల్పోయి ఆ ఆవరణలోనే పడిపోయాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతిచెందారు. బుచ్చయ్య 20 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాంగ్రెస్ సర్పంచి అభ్యర్ధులు 1830 మంది, BRS సర్పంచి అభ్యర్ధులు 921, BJP సర్పంచి అభ్యర్ధులు 149, ఇతరులు 410 మంది ఇప్పటి వరకు గెలుపొందారు.
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారంలో ఉద్రిక్తతత నెలకొంది. ఓట్ల లెక్కింపులో ఘర్షణ తలెత్తడంతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి.
మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొండాపుర్‌లో ఒకే ఓటు తేడాతో ప్రత్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్ధి బేగరి పండరి సర్పంచ్‌గా గెలుపొందారు.
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చిన్న ఎల్కచెర్ల గ్రామంలో జరిపిన రీకౌంటింగ్‌లోనూ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 212 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేయాగా.. కాంగ్రెస్ అభ్యర్ధి మరాఠి రాజ్‌కుమార్ గెలుపొందినట్లు ప్రకటించారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరందోలి గ్రామ సర్పంచిగా స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ పుష్పలత కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రత్యర్థి అభ్యర్థి దిలీప్ కాటేపై గెలుపొందారు.
చండూరు మండలం శిరిదేపల్లి గ్రామ సర్పంచ్‌గా దామెరా రాములు (BRS ) 236 ఓట్లతో విజయం సాధించారు. ఇక మహబూబాబాద్ గూడూరు మండలం దామరవంచ సర్పంచ్ ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. మొదట 3 ఓట్లతో BRS అభ్యర్ధి స్వాతి గెలుపొందగా.. రీకౌంటింగ్‌లో కాంగ్రెస్ మద్దతుదారు సుజాత ఒక్క ఓటు తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. దీంతో మళ్లీ రీకౌంటింగ్ చేపట్టారు.
నల్గొండ జిల్లా చండూరు మండలం గొల్లగూడెం సర్పంచిగా BRS అభ్యర్ధి రావుల రజిత.. కాంగ్రెస్ అభ్యర్థి ఇటిక శ్రావణిపై 30 ఓట్లతో గెలుపొందారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడెంలో BRS అభ్యర్ధి రేవతికి 6 ఓట్లు ఆధిక్యం రావడంతో రీకౌంటింగ్ చేయాలని ప్రత్యర్థి డిమాండ్ చేశారు. దీతో పోలింగ్ అధికారులు రీకౌంటింగ్ చేస్తున్నారు.
వికారాబాద్‌లో కొండగల్ మండలం ఖాజాహైమద్‌పల్లిలో సర్పంచి అభ్యర్ధిగా పోటీ చేసిన ఓటమి లక్ష్మి ఓటమి పాలైంది. దీంతో ఓటమి తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి పురుగుల మందు తాగింది. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బద్యాతండాలో ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. మొదట ఒకేఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్ధి సర్పంచిగా గెలిచినట్టు ప్రకటించారు. రెండోసారి రీకౌంటింగ్‌లో 3 ఓట్ల తేడాతో BRS అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ఆందోళనతో అధికారులు మూడోసారి ఓట్ల లెక్కింపు చేపట్టారు.
తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఈ రోజు జరిగిన పోలింగ్‌లో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు.. 27,628 వార్డు స్థానాలకు, 65,455 మంది పోటీ పడ్డారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఏకగ్రీవంతో కలిపి కాంగ్రెస్ అభ్యర్ధులు 776 మందికిపైగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. BRS అభ్యర్థులు 312 మంది, BJP 63 మంది, ఇతరులు 164 మంది ఇతరులు గెలుపొందారు.
యాదాద్రి జిల్లా లక్ష్మక్కపల్లిలో ఇద్దరు సర్పంచి అభ్యర్ధులకు సమానంగా 148 ఓట్లు రావడంతో అధికారులు డ్రా తీశారు. లాటరీలో BRS అభ్యర్ధి ఇండ్ల రాజయ్యను విజయం వరించింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో పలు చోట్ల BRS అభ్యర్ధులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మహమ్మాదాబాద్ మండలం ఎలకిచెరువు తండా బీఆర్‌ఎస్ అభ్యర్ధి సోమ్లా, మహబూబ్‌నగర్ తువ్వగడ్డ తండాలో చాందిని శంకర్ గెలుపొందారు. అలాగే రాజాపూర్ మండలంలోని రాఘవపూర్, దోండ్లపల్లి, చొక్కం పేట్, కుతినేపల్లి, కోర్ర తండా, రంగారెడ్డి పల్లి, లాల్యా నాయక్ తండ, వెల్డండ మండలం పోతేపల్లి గ్రామాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్ధులు గెలుపొందారు.
రంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామంలో BRS సర్పంచ్ అభ్యర్థి రేవతి 6 ఓట్లతో విజయం సాధించారు.
ఇప్పటి వరకు కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్ధులు 513 మంది, బీఆర్ఎస్ అభ్యర్ధులు 164 మంది, బీజేపీ 19 మంది ఇప్పటి వరకు సర్పంచులుగా ఎన్నికయ్యారు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పాటిమీది తండాలో స్వతంత్ర అభ్యర్థి అపవాత్ రాజు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బండేయేర్ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోర్లబోడుతండా లో భూక్య చిన్నయ్య, కొనిజర్ల మండల పరిధిలోని మేకలకుంట గ్రామపంచాయతీలో భూక్య అనిత, మధిర మండలం వెంకటాపురం పరుచూరి హరినాథ్, కొనిజర్ల మండల పరిధిలోని గద్దలగూడెం భూక్య రామ్ లాల్ సర్పంచులుగా గెలిచారు.
సంగారెడ్డి మండలం నాగపూర్‌లో వార్డ్ నెంబర్ మూడులో అర్చన, విజయ లక్ష్మికి 30 సమాన ఓట్లు వచ్చాయి. టాస్ వేయగా విజయలక్ష్మి గెలుపు కైవసం చేసుకున్నారు. అలాగే గౌరారం రెండో వార్డులో అభ్యర్థులు ఇద్దరికీ సమాన మెజారిటీ వచ్చింది. రాజేందర్, పసుల వెంకటయ్యలకు సమానంగా 67 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా తీశారు. ఇందులో వెంకటయ్య విజయం సాధించారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్ధి కొప్పుల రజిని గెలుపు
మెట్పల్లి మండలం కేసీఆర్ తాండ సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి మంజుల, ఎ.ఎస్.ఆర్.తండా సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి సురేందర్ గెలుపు
నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామ సర్పంచ్ గా ఉప్పెర లక్ష్మీ, ఆదర్శ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా బర్కుంట లక్ష్మి సర్పంచులుగా గెలిచారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి మేఘావత్ లత గెలుపొందారు.
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గ్రామాల్లో వేణునగర్: భీమ్ రావు, పెంబి తండా: గంగాధర్, ఇటిక్యాల తండా: చంద్ర బాను, శెట్పెల్లి: విట్టల్, దొందారి: గంగుబాయ్, పుల్గం పాండ్రి: నంద్యా నాయక్, పసపుల: గుగ్లావత్ సంతోష్ సర్పంచులుగా గెలిచారు.
నల్గొండలో మద్దిరాల మండలం తూర్పుతండాలో ఒక్క ఓటు తేడాతో భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి భూక్య వీరన్న ప్రత్యర్థిపై ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించారు.
కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెలో తల్లిపై కూతురు విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి పల్లపు సుమలత ఆమె తల్లి గంగవ్వపై 91 ఓట్ల మెజారిటీతో గెలుపు సొంతం చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి దారావత్ చిరంజీవి విజయం సాధించారు.
కొండపాకని గూడెం భారతరాష్ట్రసమితి పార్టీ దాసరి మల్లేష్ 63 ఓట్లతో, చిప్పలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి బండ అంజిరెడ్డి 29 ఓట్లతో గెలుపొందారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి దారావత్ చిరంజీవి, ఆత్మకూరు ఎం మండలం సారగండ్లగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి చలమయ్య విజయం.
కల్వకుర్తి మండలం బెక్కర గ్రామ సర్పంచ్‌గా భీమమ్మ , అదే మండలం జంగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్‌గా రామకృష్ణారెడ్డి విజయం సాధించారు.
చండూరు మండలం గొల్లగూడెం సర్పంచిగా భారత రాష్ట్ర సమితి రావుల రజిత విజయం సాధించారు. తాండూర్ మండలం గౌతపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి శోభారాణి 29 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకున్నారు.
వేములవాడ గ్రామీణ మండలం తుర్కాశి నగర్‌లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి షేక్ షాదుల్లా గెలుపొందారు. తుంగతుర్తి మండలం బాపనబావి తండాలో కాంగ్రెస్ అభ్యర్థి సభావత్ బికోజి గెలుపొందారు.
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మాందాపూర్ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి లింగాల మౌనిక, వేములవాడ మండలం జయవరంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంద్రాల ప్రసాద్ గెలిచారు.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లిలో భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి రామరాజు 40 ఓట్ల తేడాతో విజయం
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం చింతలకుంట తండా సర్పంచ్‌గా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి జాటోతు రవి గెలుపు కైవసం చేసుకున్నారు. తాండూరు మండలం చింతామణిపట్నంలో భారత రాష్ట్ర సమితి సర్పంచ్ అభ్యర్థి కురువ మౌనిక 17 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మహబూబ్ నగర్‌లో తొలి ఫలితం విడుదలైంది. అక్కడి తువ్వగడ్డ తండా సర్పంచ్‌గా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి చాంది బాయి విజయం సాధించారు.
పెద్దపల్లి జిల్లా కామన్ పూర్‌లో 3:18కి ఆలస్యంగా ఎన్నికల లెక్కింపు మొదలైంది. ఇక భద్రాచలంలో లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు.
పెద్దెముల్ మండలం ఊరేంటి తండాలో సర్పంచ్‌గా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సువర్ణ విజయం సాధించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఖాజాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ రామిరెడ్డి 98 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు.
భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామంలో భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి గెలుపు కైవసం చేసుకున్నారు. ధర్మగారి భాగ్యమ్మ 5 ఓట్ల తేడాతో సర్పంచ్‌గా సమీప అభ్యర్థి లక్ష్మిపై విజయం సాధించారు.
తొలి విడతలో 3 వేల 834 సర్పంచ్ స్థానాలతో పాటు 27 వేల628 వార్డులకు పోలింగ్ జరిగింది. తొలివిడతలో 12 వేల 960 మంది సర్పంచ్ బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 502 గ్రామ పంచాయతీల్లో 84.02 శాతం నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 75.88 శాతం.. వికారాబాద్ జిల్లాలో 73.82 శాతం పోలింగ్ నమోదైంది. ఆయా పల్లెల్లో సర్పంచ్ సాబ్ కాబోయేది ఎవరనే దానిపై మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడవనున్నాయి. ప్రస్తుతం ఒక్కొక్క విజేతల పేర్లు వెల్లడిస్తున్నారు.
తెలంగాణలో తొలివిడత ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొన్ని చోట్ల పూర్తికాగా.. మరికొన్ని చోట్ల కొనసాగుతోంది. పలుచోట్ల భారీ భద్రత నడుమ అధికారులు ఓట్లు లెక్కిస్తున్నారు. సాయంత్రం 5 గంటల్లోపు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
వేములవాడ మండలం జయవరంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంద్రాల ప్రసాద్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రామరాజు 40 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు.
వేములవాడ గ్రామీణ మండలం తుర్కాశి నగర్‌లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి షేక్ షాదుల్లా విజయం సాధించారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మాందాపూర్ సర్పంచిగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి లింగాల మౌనిక విజయం దక్కించుకున్నారు.
తుంగతుర్తి మండలం బాపనబావి తండాలో కాంగ్రెస్ అభ్యర్థి సభావత్ బికోజి సర్పంచిగా విజయం సాధించారు.
ఎట్టకేలకు తొలి విడత పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసింది. ఇక విజేత ఫలితాలు ఒక్కొక్కటిగా ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు. చండూరు మండలం గొల్లగూడెం గ్రామంలో సర్పంచిగా భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్ధి రావుల రజిత ఘన విజయం సాధించారు.
రాష్ట్రంలో మొత్తం మూడు విడుతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో 12,960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలివిడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల్లోపు ఫలితాలు వెలువడనున్నాయి.
తొలి విడత సర్పంచి ఎన్నికల్లో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇందులో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 3,834 సర్పంచ్ స్థానాలకు ఈ రోజు పోలింగ్ నిర్వహించగా మధ్యాహ్నం 2 గంటలకు ఓటింగ్ ముగిసింది. మరికాసేపట్లోనే ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 88.67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు 2700 km దూరంలోని ఐఐటి గౌహతిలో ఐఐటి మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అశ్విత.. సంగారెడ్డి మండలంలోని స్వగ్రామమైన కందిలో ఓటు హక్కు వినియోగించుకుంది.
రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్ తండాలో మరో ఓటర్ హల్‌చల్ చేశాడు. పోలింగ్ స్టేషన్‌లో బ్యాలెట్ పేపర్‌ను ఓ వ్యక్తి చించేశాడు. పొరపాటున వేరే అభ్యర్థికి ఓటు వేయడంతో బ్యాలెట్ పేపర్ చించేశానని సత్యనారాయణ తెలిపాడు. దీంతో అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జగిత్యాల జిల్లా వెంకటాపూర్‌లో వింత ఘటన. బ్యాలెట్ పేపర్‌ను నమిలి ఉమ్మేసిన ఓటర్. మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్ వెంకట్ అనే వ్యక్తి నమిలి ఉమ్మేశాడు. వెంటనే పోలీసులు వెంకట్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికలు క్లైమాక్స్‌కి చేరాయి. ఇప్పటికే ఆయా పల్లెల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల భారీ భద్రత నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రయి కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలలోపు ఫలితాలు వెలువడనున్నాయి. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
Ambulance Vote