MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కొత్త అభియోగాలు.. ఈడీ ఛార్జ్‌షీటులో కవితతో పాటు భర్త అనిల్ కుమార్ పేరు

|

May 01, 2023 | 7:38 PM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన అభియోగాలు మోపింది ఈడీ. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా భూములు కొన్నారని ఈడీ పేర్కొంది. కొనుగోళ్ల లావాదేవీలు పిళ్లై అకౌంట్‌ నుంచే జరిగాయంటోంది ఈడీ. హైదరాబాద్‌లో కవిత 3 ఆస్తులు కొనుగోలు చేశారని.. రాజకీయ పలుకుబడితో తక్కువ రేటుకు భూములు దక్కించుకున్నారని

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కొత్త అభియోగాలు.. ఈడీ ఛార్జ్‌షీటులో కవితతో పాటు భర్త అనిల్ కుమార్ పేరు
MLC Kavitha and Husband
Follow us on

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కొత్త అభియోగాలు నమోదు చేసింది ఈడీ. ఇందులో భాగంగా మూడో ఛార్జిషీట్‌లో సంచనల విషయాలు బయటపెట్టింది ఈడీ. మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, రాఘవ, కవిత, శరత్‌పై కొత్త అభియోగాలు చేర్చింది. హవాలా, ముడుపులు, భూముల కొనుగోళ్లపై ఈడీ ప్రస్తావన చేసింది. రూ.100కోట్ల ముడుపులపై ఆధారాలు దొరికాయంటోంది ఈడీ.  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన అభియోగాలు మోపింది ఈడీ. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా భూములు కొన్నారని ఈడీ పేర్కొంది. కొనుగోళ్ల లావాదేవీలు పిళ్లై అకౌంట్‌ నుంచే జరిగాయంటోంది ఈడీ.

హైదరాబాద్‌లో కవిత 3 ఆస్తులు కొనుగోలు చేశారని.. రాజకీయ పలుకుబడితో తక్కువ రేటుకు భూములు దక్కించుకున్నారని అభియోగం మోపింది. ఈడీ ఛార్జ్‌షీటులో కవితతో పాటు భర్త అనిల్ కుమార్ పేరును చేర్చింది. లిక్కర్ లాభాలతో భూములు కొనేందుకు కవితకు ఫీనిక్స్‌‌కు చెందిన శ్రీహరి సహకరించారంటోంది ఈడీ.

ఫస్ట్‌టైమ్‌ ఆర్ధిక లావాదేవీలను తెరపైకి..

థర్డ్‌ ఛార్జిషీట్‌లో అనేకసార్లు కవిత పేరును ప్రస్తావించిన ఈడీ, ఫస్ట్‌టైమ్‌ ఆర్ధిక లావాదేవీలను తెరపైకి తెచ్చింది. కవిత భర్త అనిల్‌తోపాటు కవిత సన్నిహితులు శ్రీనివాస్‌రావు, సృజన్‌రెడ్డి, ఫీనిక్స్‌ శ్రీహరి రోల్‌ను రివీల్‌ చేసింది. లిక్కర్‌ బిజినెస్‌లో వచ్చిన లాభాలతో కవిత పెద్దఎత్తున భూములు కొన్నట్టు చెప్పింది ఈడీ. అయితే, లావాదేవీలన్నీ బినామీ అరుణ్‌ పిళ్లై ద్వారా జరిపినట్టు ఛార్జిషీట్‌లో పేర్కొంది. హైదరాబాద్‌లో కవిత 3 ఆస్తులను కొన్నట్టు చెప్పింది. కవిత తన రాజకీయ పలుకుబడితో తక్కువ రేట్‌కే భూములు దక్కించుకున్నారని, అందుకు ఫీనిక్స్‌ శ్రీహరి సహకరించినట్టు కొత్త విషయాలు బయటపెట్టింది.

కవితతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డిపైనా సంచలన అభియోగాలు నమోదుచేసింది ఈడీ. ఢిల్లీలో లిక్కర్‌ బిజినెస్‌ చేయడం కోసం కేజ్రీవాల్‌తో మాగుంట అనేకసార్లు సమావేశమైనట్టు వెల్లడించింది. కేజ్రీవాల్‌ కూడా మాగుంటను ఢిల్లీ లిక్కర్‌ బిజినెస్‌లోకి ఆహ్వానించారని పేర్కొంది. ఇక… మాగుంట, కవిత మధ్య పలుమార్లు చర్చలు జరిగాయని… ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో సమావేశమయ్యారని ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. అయితే, తెరపైన కొడుకు రాఘవను ఉంచి, తెరవెనక కథ మొత్తం ఎంపీ మాగుంట నడిపించారంటూ అసలు సంగతి బయటపెట్టింది ఈడీ.

థర్డ్‌ ఛార్జిషీట్‌ తర్వాత ఏం జరగబోతోందంటే..

మూడో ఛార్జిషీట్‌లో సంచలన అభియోగాలతోపాటు ఆధారాలను కూడా జత చేసింది ఈడీ. సూత్రధారులు, పాత్రధారుల మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్స్‌ను, ఈ-మెయిల్స్‌ను అందజేసింది. ఛార్జిషీటూ ఛార్జిషీటుకూ కొత్త అభియోగాలు నమోదు చేస్తూ కలకలం రేపుతోంది ఈడీ. మరి, థర్డ్‌ ఛార్జిషీట్‌ తర్వాత ఏం జరగబోతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నెక్ట్స్‌ ఏంటి?. విచారణ పేరుతో మళ్లీ హీట్‌ పుట్టిస్తుందా! లేక డైరెక్ట్‌గా అరెస్టులే చేస్తుందా!.

వీడియో కోసం ఇక్కడ చూడండి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం