HCA: హెచ్‌సీఏ కేసులో ఈడీ దూకుడు.. ఐదుగురిపై ఈసీఐఆర్ నమోదు..

హెచ్‌సీఏ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఐదుగురిపై కేసు నమోదు చేసింది. గతంలో నమోదైన రెండు కేసులతో కలిపి కొత్త ఈసీఐఆర్ నమోదు చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, సీఈవో సునీల్‌, ట్రెజరర్‌ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ సెక్రటరీ రాజేందర్‌యాదవ్‌, క్లబ్‌ ప్రెసిడెంట్‌ కవిత యాదవ్‌లపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఈడీ ఎందుకు ఎంటర్ అయ్యిందంటే..

HCA: హెచ్‌సీఏ కేసులో ఈడీ దూకుడు.. ఐదుగురిపై ఈసీఐఆర్ నమోదు..
HCA ED

Updated on: Jul 17, 2025 | 6:24 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసింది. గతంలో నమోదైన రెండు హెచ్‌సీఏ కేసులు కలిపి కొత్త ఈసీఐఆర్ నమోదు చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, సీఈవో సునీల్‌, ట్రెజరర్‌ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ సెక్రటరీ రాజేందర్‌యాదవ్‌, క్లబ్‌ ప్రెసిడెంట్‌ కవిత యాదవ్‌లపై కేసు నమోదు చేసింది. పీఎమ్ఎల్ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. బీసీసీఐ నిధుల విషయంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనిపై మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి కోరనుంది. ప్రస్తుతం నిందితులు సీఐడీ కస్టడీలో ఉన్నారు. సీఐడీ కస్టడీ ముగిసిన వెంటనే ఈడీ నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు హెచ్‌సీఏ అక్రమార్కులపై కొరడా ఝులిపించిన సీఐడీ.. దర్యాప్తును మరింత స్పీడప్‌ చేసింది. హెచ్‌సీఏలో వేళ్లూనుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో పెకిలించడానికి.. నిందితులను కస్డడీకి తీసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, హెచ్‌సీఏ సీఈవో సునీల్‌, హెచ్‌సీఏ ట్రెజరర్‌ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ సెక్రటరీ రాజేందర్‌యాదవ్‌, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ కవిత యాదవ్‌ను ఆరురోజులు కస్టడీకి తీసుకొని విచారిస్తోంది. హెచ్‌సీఏ క్లబ్స్‌లో అవకతవకలు, గత హెచ్‌సీఏ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై సీఐడీ ప్రధానంగా ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. హెచ్‌సీఏకు వచ్చిన నిధులు, వాటిని ఖర్చు చేసిన విధానంపై సీఐడీ లోతుగా విచారణ చేస్తోంది. వీరిని విచారిస్తే హెచ్‌సీఏలో జరిగిన అవకతవకలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.

ఇక ఈ కేసులో ఏ2గా ఉన్న హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్‌‎ను తప్ప మిగిలిన అధికారులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దేవరాజ్ మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. దేవరాజ్ పారిపోవడానికి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డే కారణమని అధికారులు గుర్తించారు. దేవరాజ్ అరెస్ట్‎కు సీఐడీ రంగం సిద్ధం చేయగా.. అరెస్ట్ సమాచారాన్ని ముందుగానే దేవరాజ్‎కు చేరవేశాడు ఎలక్షన్ రెడ్డి. దీంతో దేవరాజ్ సీఐడీకి చిక్కలేదు. సీఐడీ సమాచారాన్ని ముందుగా లీక్ చేసినందుకు సీఐ ఎలక్షన్ రెడ్డిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…