బ్రేకింగ్‌.. బాలానగర్‌లోని ఓ ఫ్యాక్టరీ భారీ అగ్నిప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌లోని బాలానగర్ పారిశ్రామిక వాడలోని డ్యూరో డైన్ ఇండస్ట్రీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాదం కారణం గా భారీ ఆస్తి నష్టం సంభవించిందని అంచనా.

బ్రేకింగ్‌.. బాలానగర్‌లోని ఓ ఫ్యాక్టరీ భారీ అగ్నిప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు
Fire Accident

Updated on: Jul 17, 2025 | 7:05 AM

హైదరాబాద్‌లోని బాలానగర్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డ్యూరో డైన్ ఇండస్ట్రీ లో అగ్ని ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే స్పాట్‌కు 5 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో భారీ ముప్పు తప్పినట్లు అయింది. అయితే ఎంత మేర ఆస్తి నష్టం సంభవించింది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.